News December 22, 2024
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు నోటీసులు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి UPలోని ఓ కోర్టు నోటీసులిచ్చింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ కులగణనపై మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన దేశ సంపదను పంచుతామని అన్నారు. ఆ వ్యాఖ్యలు దేశాన్ని విడదీసేలా ఉన్నాయంటూ పంకజ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, వచ్చే నెల 7న విచారణకు హాజరుకావాలని రాహుల్‌ను ఆదేశించింది.
Similar News
News December 22, 2024
దురుసుగా ప్రవర్తిస్తే బౌన్సర్ల తాట తీస్తాం: సీపీ
TG: పబ్లిక్‌తో సెలబ్రిటీల బౌన్సర్లు దురుసుగా ప్రవర్తిస్తే వారి తాట తీస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బౌన్సర్ల విషయంలో సెలబ్రిటీలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ‘ఎక్కడైనా బౌన్సర్లు ఓవరాక్షన్ చేస్తే చర్యలు తప్పవు. జనాలను తోయడం, కొట్టడం, దూషించడం వంటివి చేయకూడదు. ఏజెన్సీలు కూడా అప్రమత్తంగా ఉండాలి. బౌన్సర్ల నియామకంలో జాగ్రత్త వహించాలి’ అని సీపీ హెచ్చరించారు.
News December 22, 2024
స్మృతి మంధాన మరో ఘనత
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనత సాధించారు. ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచారు. ఈ ఏడాది ఆమె 1,602 పరుగులు చేశారు. ఈ క్రమంలో లారా వాల్వడర్ట్(1,593)ను అధిగమించారు. విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆమె ఈ ఫీట్ సాధించారు. కాగా ఈ మ్యాచులో స్మృతి (91) కొద్దిలో శతకం చేజార్చుకున్నారు. జేమ్స్ బౌలింగ్‌లో ఆమె వికెట్ల ముందు దొరికిపోయారు.
News December 22, 2024
అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణలు చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
TG: సీఎం రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారని బన్నీ మాట్లాడటం సరికాదన్నారు. ఆసుపత్రిలో బాలుడిని పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనడం హాస్యాస్పదమని చెప్పారు. మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటి? సూపర్ స్టార్ అయితే ఏంటి? అని ప్రశ్నించారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేశారు.