News October 27, 2024

రేణూ దేశాయ్‌కి ఉపాసన సాయం!

image

నటి రేణూ దేశాయ్ ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. కుక్కలు, పిల్లులు వంటి మూగజీవాలను రెస్క్యూ చేయడమే ఈ సంస్థ పని. అందుకు విరాళాలు ఇవ్వాలని ఆమె కోరగా హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన స్పందించినట్లు తెలుస్తోంది. తన పెంపుడు శునకం రైమ్ పేరిట ఆమె ఈ సాయం చేశారట. దీంతో పెట్స్ రెస్క్యూ కోసం వ్యాన్ కొనుగోలుకు సాయం చేసినందుకు ‘థాంక్యూ రైమ్, ఉపాసన’ అంటూ రేణూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.

Similar News

News November 28, 2025

ఇలాంటి వరుడు అరుదు.. అభినందించాల్సిందే!

image

‘కట్నం అడిగినవాడు గాడిద’ అనే మాటను పట్టించుకోకుండా కొందరు అదనపు కట్నం కోసం వేధిస్తుంటారు. అలాంటిది కట్నం వద్దంటూ తిరిగిచ్చాడో యువకుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన వరుడు కట్నం తీసుకునేందుకు నిరాకరించాడు. కొవిడ్ సమయంలో తండ్రిని కోల్పోయిన వధువు కుటుంబం రూ.31లక్షల కట్నం సిద్ధం చేసింది. ‘నాకు ఈ కట్నం తీసుకునే హక్కులేదు’ అని చెప్పి రూపాయి మాత్రమే స్వీకరించి ఔరా అనిపించాడు.

News November 28, 2025

ఐఐఎం విశాఖలో ఉద్యోగాలు

image

ఐఐఎం విశాఖపట్నం కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.30వేలు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iimv.ac.in

News November 28, 2025

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

image

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు పాజిటివ్ టాక్ రావడంతో తొలిరోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.7.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. ఏపీ, తెలంగాణలో రూ.4.35 కోట్లు వసూలు చేసింది. అటు ఓవర్సీస్‌లోనూ ఫస్ట్ డే 2,75,000 డాలర్స్ కలెక్ట్ చేసింది. రేపటి నుంచి వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి.