News October 27, 2024
రేణూ దేశాయ్‌కి ఉపాసన సాయం!
నటి రేణూ దేశాయ్ ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. కుక్కలు, పిల్లులు వంటి మూగజీవాలను రెస్క్యూ చేయడమే ఈ సంస్థ పని. అందుకు విరాళాలు ఇవ్వాలని ఆమె కోరగా హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన స్పందించినట్లు తెలుస్తోంది. తన పెంపుడు శునకం రైమ్ పేరిట ఆమె ఈ సాయం చేశారట. దీంతో పెట్స్ రెస్క్యూ కోసం వ్యాన్ కొనుగోలుకు సాయం చేసినందుకు ‘థాంక్యూ రైమ్, ఉపాసన’ అంటూ రేణూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.
Similar News
News November 10, 2024
హౌతీలపై అమెరికా భీకర దాడులు
యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్‌పై అమెరికా విరుచుకుపడింది. హౌతీలకు చెందిన పలు ఆయుధ డిపోలను యూఎస్ యుద్ధ విమానాలు ధ్వంసం చేసినట్లు పెంటగాన్ తెలిపింది. అత్యాధునిక ఆయుధాలతో తాము పేల్చేసినట్లు వెల్లడించింది. కాగా ట్రంప్ అధ్యక్షుడయ్యాక హౌతీలపై ఇదే తొలి దాడి. మరోవైపు మిడిల్ ఈస్ట్‌లో శాంతి నెలకొల్పేందుకు F-15 ఫైటర్ జెట్‌తోపాటు బాంబర్స్, ట్యాంకర్, బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ డెస్ట్రాయర్స్‌ను పంపింది.
News November 10, 2024
నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతోన్న ‘దేవర’
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ OTTలో అదరగొడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా నంబర్ వన్ ట్రెండింగ్‌లో నిలిచింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు టాక్.
News November 10, 2024
రేవంత్‌వి అన్నీ బోగస్ మాటలే: హరీశ్ రావు
TG: CM రేవంత్ అన్ని వర్గాలను మోసం చేశారని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. చెప్పేవన్నీ బోగస్ మాటలేనని ఆయన విమర్శించారు. ‘రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు.. నియామకాలు లేవు, నిరుద్యోగ భృతి ఏమైంది. రూ.4 వేల పెన్షన్ రాలేదు. మహిళలకు రూ.2,500 ఏవీ? 40 లక్షల మందికి రుణమాఫీ చేశారనేది బోగస్. రైతుభరోసా అందలేదు. వరిపంటకు బోనస్ ఇవ్వలేదు. రేవంత్ అబద్ధాల ప్రచారం మహారాష్ట్రలో కూడా కొనసాగిస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.