News February 6, 2025

ఉపాసన కొత్త కార్యక్రమం.. తొలుత పిఠాపురంలో అమలు

image

అపోలో ఆస్పత్రుల అధినేత, తన తాత ప్రతాప్ రెడ్డి బర్త్ డే(FEB5) సందర్భంగా ఉపాసన కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమం కోసం పిఠాపురం నుంచి ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. గర్భిణులకు పౌష్ఠికాహారం, ప్రసూతి, శిశు మరణాలను అరికట్టడం, మహిళా సాధికారతపై అవగాహన కల్పించడం దీని ఉద్దేశమన్నారు. త్వరలోనే 109 అంగన్వాడీ భవనాలు పునరుద్ధరిస్తామని చెప్పారు.

Similar News

News December 11, 2025

నిద్ర తక్కువైతే!

image

నిద్ర తక్కువైతే ఆరోగ్యం దెబ్బతిని గుండె జబ్బులు, బీపీ, మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కొన్ని రోజులు సరైన నిద్ర లేకుంటే రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఏకాగ్రత లోపించడం, నిరాశ, కుంగుబాటు వంటివి పెరుగుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి ఆయుష్షునూ తగ్గిస్తుంది’ అని చెబుతున్నారు. మంచి నిద్ర కోసం ధ్యానం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, క్రమమైన నిద్ర సమయాలు పాటించాలని సూచిస్తున్నారు.

News December 11, 2025

రోహిత్ గొప్ప హృదయానికి అది నిదర్శనం: జైస్వాల్

image

సౌతాఫ్రికాతో ఇటీవల భారత్ ఆడిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ తన కెరీర్‌లోనే తొలి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే క్రీజులో కుదురుకునేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ తనతో మాట్లాడుతూ భరోసా ఇచ్చినట్లు జైస్వాల్ తెలిపారు. ‘నేను రిస్క్ తీసుకుంటా. నువ్వు ప్రశాంతంగా టైం తీసుకొని ఆడు’ అని తనతో చెప్పినట్లు వివరించారు. ఇది తన గొప్ప హృదయానికి నిదర్శనం అని కొనియాడారు.

News December 11, 2025

అలా తిట్టడం వల్లే ‘రాజా సాబ్’ తీశా: మారుతి

image

నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్లు, తిట్టేవాళ్లకి చాలా థాంక్స్ అని డైరెక్టర్ మారుతి అన్నారు. అలాంటి వారు లేకపోతే తాను ‘రాజా సాబ్’ తీసేవాడిని కాదని తెలిపారు. వారంతా తమ పనులన్నీ మానుకొని, పాజిటివిటీని చంపుకొని మరొకరి కోసం టైం పెడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు. తమలోని నెగిటివిటీని వారు పంచుతున్నారని, అదంత ఈజీ కాదన్నారు. ఎవరైనా తిడితే ఎనర్జీగా మార్చుకొని ముందుకెళ్లాలని ఓ ఈవెంట్‌లో సూచించారు.