News August 26, 2024
టాలీవుడ్‌లో అప్‌కమింగ్ రీరిలీజ్‌లు
*ఆగస్టు 28- మాస్
*ఆగస్టు 30- నరసింహనాయుడు
*సెప్టెంబర్ 2- గబ్బర్ సింగ్
*సెప్టెంబర్ 14- 3 మూవీ
*సెప్టెంబర్ 23- డార్లింగ్
*అక్టోబర్ 23- ఈశ్వర్
*జనవరి 26- ఖడ్గం
మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News September 14, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటాం: గంటా
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగువారి సెంటిమెంట్ అని MLA గంటా శ్రీనివాసరావు అన్నారు. ‘స్టీల్ ప్లాంట్ ఆత్మాభిమానాలతో ముడిపడి ఉంది. ప్రైవేటీకరణ కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కచ్చితంగా కాపాడుకుంటాం. ప్రైవేటీకరణను అడ్డుకోవడం YCP వల్ల కాలేదు. పక్క రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల కోసం సీఎంలు స్వయంగా రోడ్లపైకి వచ్చారు. దీంతో ప్రైవేటీకరణ యోచనను కేంద్రం మానుకుంది’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.
News September 14, 2024
కొత్త రేషన్ కార్డుల జారీపై ఈనెల 20న విధివిధానాలు?
TG: సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ ఈనెల 20న భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలను ఖరారు చేసే అవకాశముంది. దీనితో పాటు హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, వరద నష్టం, హెల్త్ కార్డులు, రైతు భరోసా, విద్య, రైతు కమిషన్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
News September 14, 2024
VIRAL: పోలీస్ నిర్బంధంలో గణనాథుడు
పోలీస్ వ్యాన్‌లో వినాయక విగ్రహం ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటో మనసును కలిచివేస్తోందని కామెంట్స్ వస్తున్నాయి. కర్ణాటకలోని మాండ్యలో హిందువులపై దాడిని నిరసిస్తూ బెంగళూరులో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈక్రమంలోనే 40మంది ఆందోళనకారులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వినాయక విగ్రహాన్ని సైతం పోలీస్ వ్యాన్‌లోకి ఎక్కించారు. అయితే కాసేపటికే దాన్ని పోలీసులు నిమజ్జనం చేసినట్లు తెలుస్తోంది.