News February 19, 2025

కొత్త రేషన్ కార్డులపై UPDATE!

image

TG ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తవి, పాతవి కలిపి కోటి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కార్డులు బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌తో పోస్ట్ కార్డు సైజులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలతో పాటు ప్రభుత్వ లోగో ఉండనున్నాయి. తొలుత ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్, రంగారెడ్డి, HYDలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Similar News

News January 15, 2026

మమతకు షాక్.. I-PAC ఆఫీసు సోదాల కేసులో నోటీసులు

image

I-PAC ఆఫీసులో సోదాల కేసులో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ED విధుల్లో జోక్యం చేసుకోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. CM మమత, రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. I-PAC ఆఫీస్‌లోని CCTV ఫుటేజీని భద్రపర్చాలని తెలిపింది. ED అధికారులపై నమోదైన FIRపై స్టే విధించింది.

News January 15, 2026

నారా ఫ్యామిలీని చూశారా.. Photo Gallery

image

AP: సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామదేవత దొడ్డి గంగమ్మ, కులదేవత నాగాలమ్మ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖర్జూరపునాయుడు, అమ్మణమ్మ, రామ్మూర్తినాయుడు సమాధుల వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, శ్రీభరత్, తేజస్విని, నారా రోహిత్, సిరి తదితరులు పాల్గొన్నారు.

News January 15, 2026

BISAG-Nలో గ్రాఫిక్ డిజైనర్ పోస్టులు

image

భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్‌ (BISAG-N)లో 5 గ్రాఫిక్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్, ఎంసీఏ, డిప్లొమా(గ్రాఫిక్స్)అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 17 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.55,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bisag-n.gov.in/