News October 16, 2024
UPDATE: నెల్లూరుకు 370కి.మీ దూరంలో వాయుగుండం
నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా 15 కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. చెన్నైకి 280 కి.మీ, పుదుచ్చేరికి 320 కి.మీ, నెల్లూరుకి 370kmల దూరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశం ఉందని చెప్పింది.
Similar News
News November 2, 2024
చలి మొదలైంది.. వీటిని తింటున్నారా?
కొన్ని ప్రాంతాల్లో చలి ప్రారంభమైంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోకపోతే చలికి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఓ టీ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. ఇది శరీరంలో వేడి పుట్టిస్తుంది. చిలగడదుంపలు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఉసిరి తింటే అనేక ఔషధాలు తిన్నట్లే. ఖర్జూరాలు, బెల్లం తింటే వేడిని పుట్టిస్తాయి. మిల్లెట్స్, నట్స్, ఆవాలు, నువ్వులు కూడా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
News November 2, 2024
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ మృతి
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ (63) గుండెపోటుతో మృతి చెందారు. హృదయ సంబంధిత సమస్యలతో ఆయన ఏడాదిగా బాధపడుతున్నారు. ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FDCI) వ్యవస్థాపక సభ్యుల్లో రోహిత్ ఒకరు. భారతీయ సంప్రదాయ వస్త్ర ముద్రణ కలగలిపి ఉండే ఆయన ఆధునిక డిజైనింగ్ వస్త్రాలు విశేష ఆదరణ పొందాయి. ఆయన పనితనంలోని ప్రత్యేకత ముందు తరాలకు స్ఫూర్తిదాయకమని FDCI కౌన్సిల్ పేర్కొంది.
News November 2, 2024
అమెరికన్లలో మళ్లీ అవే భయాలు!
పెన్సిల్వేనియాలో ఓట్ల అవకతవకలపై ఆరోపణలు చేయడం ద్వారా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సవాల్ చేయవచ్చనే ఆందోళనలు ఊపందుకున్నాయి. గత ఎన్నికల ఫలితాల్ని సవాల్ చేస్తూ జనవరి 6, 2021న తన అనుచరులతో క్యాపిటల్ భవనం వద్ద ట్రంప్ చేసిన ఆందోళనలను తాజా ఆరోపణలు గుర్తు చేస్తున్నాయని అంటున్నారు. అయితే, ఓటర్ ఫ్రాడ్‌పై ఆధారాలు లేవని ఎన్నికల అధికారులు తేల్చారు.