News August 31, 2024

UPI సర్కిల్, eRupi: గూగుల్ పే కొత్త ఫీచర్లు

image

గూగుల్ పే సరికొత్తగా UPI సర్కిల్ ఫీచర్‌‌ను ఆవిష్కరించింది. ఇందులో లావాదేవీలు చేపట్టినప్పుడు కుటుంబీకులు, మిత్రుల బ్యాంకు ఖాతాలను లింక్ చేయకుండానే వారిని సెకండరీ పార్టిసిపెంట్లుగా జతచేయొచ్చు. దీంతో చెల్లింపుల బాధ్యతను పాక్షికం/పూర్తిగా వారికి అప్పగించే అవకాశం యూజర్లకు దొరుకుతుంది. అంటే ఒక కుటుంబం లేదా ప్రత్యేక బృందం కలిసి ఖర్చుల్ని మేనేజ్ చేసుకోవచ్చు. దీంతోపాటు వోచర్ ఆధారిత eRupiని తీసుకొచ్చింది.

Similar News

News September 9, 2024

సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

image

TG: రాష్ట్రంలో సికింద్రాబాద్‌తో పాటు ప్రధాన రైల్వే స్టేషన్లకు వెళ్లే రోడ్ల విస్తరణకు సహకరించాలని CM రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇరుకు రహదారులతో పీక్ అవర్స్‌లో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చొరవ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రైల్వే రంగంతో పాటు ఇతర మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

News September 9, 2024

సలార్-2లో మోహన్ లాల్?

image

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన సలార్ మూవీ బ్లాక్‌బస్టర్ అవడంతో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం మోహన్ లాల్‌ను మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా, శ్రుతి హాసన్, శ్రియా రెడ్డి నటిస్తున్న విషయం తెలిసిందే.

News September 9, 2024

MPలో స్పోర్ట్స్ క్యాలెండర్‌లోకి ‘పిట్టు’

image

కనుమరుగైపోతున్న ‘పిట్టు’ గేమ్‌ను మధ్యప్రదేశ్ విద్యాశాఖ స్పోర్ట్స్ క్యాలెండర్‌లో చేర్చింది. శ్రీకృష్ణ భగవానుడు ఈ ఆట ఆడేవారని, ఇది దేశంలోనే అతి పురాతన ఆటల్లో ఒకటిగా పేర్కొంది. దీంతో ఇక నుంచి అక్కడి యూనివర్సిటీలు, కాలేజీల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. దీన్ని పల్లి, లగోరీ అని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఇంతకీ మీ ఏరియాలో దీన్ని ఏమంటారు?