News August 10, 2024
మున్ముందు ఫేస్ ఐడీ, ఫింగర్ ప్రింట్‌తోనూ UPI చెల్లింపులు?
యూపీఐ పేమెంట్స్‌కు ప్రస్తుతం పిన్ వాడుతున్నాం. డిజిటల్ లావాదేవీల విషయంలో ప్రత్యామ్నాయ భద్రత విధానాలనూ అనుసరించాలని RBI ఇటీవల ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే ఫేస్ ఐడీ, ఫింగర్ ప్రింట్ ఫీచర్ల సదుపాయాన్ని కూడా తీసుకొచ్చేందుకు భారత జాతీయ చెల్లింపుల సంస్థ(NPCI) యోచిస్తున్నట్లు సమాచారం. దీని కోసం పలు సంస్థలతో చర్చలు జరుపుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Similar News
News September 19, 2024
బాలికలపై లైంగిక వేధింపులు.. వార్డెన్ సస్పెండ్
AP: ఏలూరులోని ఓ ఆశ్రమ హాస్టల్‌లో బాలికలపై లైంగిక వేధింపులకు <<14129113>>పాల్పడిన<<>> గ్రేడ్-2 సంక్షేమాధికారి శశికుమార్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ప్రాథమిక దర్యాప్తు చేయించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. పూర్తి విచారణ అనంతరం శశికుమార్, అతడికి సహకరించిన వారిపై పోక్సో కేసు నమోదుచేస్తామని చెప్పారు.
News September 19, 2024
మద్యం షాపు దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు
AP: నూతన మద్యం పాలసీలో భాగంగా 3,736 లిక్కర్ షాప్‌లలో 10 శాతం(340) గీత కార్మికులకు రిజర్వ్ చేస్తారు. దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు. లాటరీ విధానంలో రెండేళ్ల కాలపరిమితితో షాపులు కేటాయిస్తారు. ఉ.10 నుంచి రా.10 వరకు షాపులకు అనుమతి ఉంటుంది. జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజు రూ.50-85 లక్షలు చెల్లించాలి. 12 ప్రధాన పట్టణాల్లో 12 ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు చేస్తారు. వీటికి అదనంగా ఫీజు నిర్ణయిస్తారు.
News September 19, 2024
T20I నంబర్-1 ఆల్‌రౌండర్‌గా లివింగ్‌స్టోన్
ఆస్ట్రేలియాతో T20 సిరీస్‌లో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. 124 రన్స్, 5 వికెట్లు తీయడంతో 253 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత స్టొయినిస్(211), సికందర్ రజా(208), షకిబ్ అల్ హసన్(206), నబీ(205), హార్దిక్ పాండ్య(199) ఉన్నారు. T20I బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ట్రావిస్ హెడ్, బౌలింగ్‌లో అదిల్ రషీద్ టాప్‌లో ఉన్నారు.