News April 18, 2024
UPSC-2023 కటాఫ్ మార్కులు
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 కటాఫ్ మార్కులను UPSC ప్రకటించింది. *ప్రిలిమ్స్: జనరల్- 75.41, EWS- 68.02, OBC- 74.75, SC- 59.25, ST- 47.82 మార్కులుగా ప్రకటించింది.
*మెయిన్స్: జనరల్- 741, EWS-706, OBC- 712, SC- 694, ST- 692
*ఫైనల్: జనరల్- 953, EWS- 923, OBC- 919, SC- 890, ST- 891
>>గత కొన్నేళ్లతో పోలిస్తే ఈసారి కటాఫ్ ఎక్కువగా ఉంది.
Similar News
News September 12, 2024
పాత పాటలు ఇష్టం.. న్యూస్ ఛానళ్లు చూడని ఏచూరి
సీతారాం ఏచూరికి 1960-70ల నాటి హిందీ పాటలంటే ఇష్టం. హిందీ, ఇంగ్లిష్ సినిమాలు చూసేవారు. న్యూస్ ఛానళ్లు మాత్రం అస్సలు చూడనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దేవుడంటే నమ్మకం లేదని, ఆధ్యాత్మిక ఉన్నతికి, మతానికి సంబంధం లేదన్నారు. నాస్తిక ఆధ్యాత్మికతను విశ్వసిస్తా అనేవారు. పొలిటీషియన్ కాకుంటే బహుశా ఎకనామిక్ ఫ్రొఫెసర్, పొలిటికల్ విద్యావేత్త అయ్యేవాడినన్నారు. తనపని గురించి ఆలోచిస్తూ రాత్రుళ్లు నిద్రపోయేవారు కాదు.
News September 12, 2024
ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం: రేవంత్
TG: సీతారాం ఏచూరి మరణంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితులయ్యారని.. ఏచూరి లేని లోటు పూడ్చలేనిదని సీఎం అన్నారు.
News September 12, 2024
రెండు రోజులు వైన్స్ బంద్
TG: గణపతి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ఈ నెల 17 ఉ.6 గంటల నుంచి 18 సా.6 వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఆ రెండు రోజులు వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులిచ్చారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు ఇది వర్తించదని పేర్కొన్నారు.