News December 13, 2024
గుకేశ్ మైండ్‌కు ఆప్టన్ ‘స్ట్రెంత్’
చదరంగం అంటేనే మైండ్ గేమ్. చెస్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ పోరులో గుకేశ్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు చైనా ప్లేయర్ డింగ్ లిరెన్ ప్రయత్నించారు. కానీ అతడు ట్రాప్‌లో పడలేదు. అందుకు కారణం ప్యాడీ ఆప్టన్. గుకేశ్‌కు ఆయన మెంటల్ కండిషనింగ్ అండ్ స్ట్రాటజిక్ కోచ్‌గా ఉన్నారు. ఆప్టన్ శిక్షణలో గుకేశ్ అంతలా రాటుదేలారు. 2011 WC గెలిచిన టీమ్ ఇండియాకు, ప్యారిస్ ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన IND హాకీ టీమ్ వెనుకుందీ ఆప్టనే.
Similar News
News January 17, 2025
హీరోపై దాడి.. నిందితుడి కోసం వేట, ఒకరి అరెస్టు
సైఫ్ అలీఖాన్‌పై కత్తి దాడి కేసు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడు చివరిసారిగా ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్‌లో పోలీసులు గుర్తించారు. ఈ ఉదయం వాసాయి-విరార్ వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పోలీసు టీంలు వాసాయి, నల్లసోపారా, విరార్ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా సైఫ్ అలీఖాన్ లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
News January 17, 2025
పంచాయతీ కార్యదర్శులకు షాక్!
TG: నల్గొండ(D)లో అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరైన 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీసును జిల్లా కలెక్టర్ బ్రేక్ చేశారు. దీంతో గైర్హాజరైన కాలానికి సంబంధించిన సర్వీసును వారు కోల్పోనున్నారు. దీని వల్ల సర్వీస్ రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్లు, పెన్షన్ల విషయంలో వారికి నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వీరిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. పాత స్థానాల్లో కాకుండా వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు.
News January 17, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రూ.650 పెరిగి రూ.81,270కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రూ.600 పెరిగి రూ.74,500 పలుకుతోంది. కేజీ వెండి రూ.1000 పెరిగి రూ.1,04,000కు చేరింది.