News November 16, 2024

‘పుష్ప-2’ నుంచి ఊర మాస్ పోస్టర్

image

సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. రేపు ఈ చిత్ర ట్రైలర్ బిహార్‌లోని పట్నాలో రిలీజ్ కానుండగా అల్లు అర్జున్ దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం 6.03 గంటలకు ట్రైలర్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.

Similar News

News November 11, 2025

ఏపీ అప్డేట్స్

image

☛ రబీలో ప్రధానమంత్రి పంట బీమా పథకం(PMFBY) అమలుకు రూ.44.06 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
☛ MBBS రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదల.. రీకౌంటింగ్‌కు ఈ నెల 17 వరకు అవకాశం
☛ కల్తీ నెయ్యి కేసులో YCP నేత వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ
☛ పింగళి వెంకయ్య, బ్రౌన్‌ల జయంతులను రాష్ట్ర పండగలుగా నిర్వహించాలని సీఎం చంద్రబాబుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లేఖ

News November 11, 2025

డేవిడ్ సలయ్‌కి ‘బుకర్ ప్రైజ్’

image

కెనడియన్-హంగేరియన్ రచయిత డేవిడ్ సలయ్‌ను ఈ ఏడాది ‘బుకర్ ప్రైజ్’ వరించింది. సాధారణ మనిషి జీవితం ఆధారంగా ఆయన రాసిన ‘ఫ్లెష్’ నావెల్‌కిగానూ ఈ పురస్కారం దక్కింది. 51 ఏళ్ల డేవిడ్ ఫైనల్లో ఐదుగురు రచయితలను వెనక్కినెట్టారు. వీరిలో ఇండియన్ మహిళా రచయిత కిరణ్ దేశాయ్ కూడా ఉన్నారు. ఆమె రాసిన ‘లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ పుస్తకం బుకర్ దక్కించుకోలేకపోయింది.

News November 11, 2025

మనీ ప్లాంట్ త్వరగా పెరగాలంటే?

image

* మనీ ప్లాంట్ పెంచే నీళ్లలో కొద్దిగా శీతల పానీయాలు పోస్తే ప్లాంట్ త్వరగా పెరుగుతుంది.
* వంటింట్లో నాలుగు మూలలు బోరిక్ యాసిడ్ పౌడర్‌ చల్లితే దోమల బెడద తగ్గుతుంది.
* కళ్లజోడు అద్దాలకు టూత్ పేస్ట్ రాసి టిష్యూ పేపర్‌తో శుభ్రం చేస్తే జిడ్డు పోతుంది.
* అన్నం మెతుకులు విడివిడిగా రావాలంటే ఉడికేటప్పుడు టేబుల్ స్పూన్ కనోలా ఆయిల్ వేయాలి.
* చపాతీలను బియ్యప్పిండితో వత్తితే మృదువుగా వస్తాయి.