News November 16, 2024
‘పుష్ప-2’ నుంచి ఊర మాస్ పోస్టర్

సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. రేపు ఈ చిత్ర ట్రైలర్ బిహార్‌లోని పట్నాలో రిలీజ్ కానుండగా అల్లు అర్జున్ దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం 6.03 గంటలకు ట్రైలర్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.
Similar News
News April 19, 2026
ఈ ఏడాదే ₹1.85 లక్షలకు 10గ్రా బంగారం?

ఈ ఏడాది చివరినాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.85 లక్షలకు చేరే అవకాశం ఉందని యాక్సిస్ డైరెక్ట్ అంచనా వేసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, లోకల్ డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. గతేడాది అక్షయ తృతీయ నుంచి ఇప్పటివరకు ధరలు 60% పెరిగాయని వెల్లడించింది. స్టాక్ మార్కెట్ కంటే బంగారంపై పెట్టుబడే మంచి లాభాలను ఇస్తోందని నివేదిక తెలిపింది.
News April 19, 2026
పవన్ త్వరగా కోలుకోవాలి.. చంద్రబాబు, లోకేశ్ ఆకాంక్ష

శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం <<19685329>>పవన్ కళ్యాణ్<<>> త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. పవన్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవుడిని ప్రార్థించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే ఆయన డాక్టర్ల సూచనల మేరకు విశ్రాంతి తీసుకోవాలని లోకేశ్ కోరారు. పవన్ ఆరోగ్యవంతుడై మళ్లీ ప్రజా సేవలో బిజీ కావాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
News April 19, 2026
బబుల్ గమ్ మింగితే ఏమవుతుంది?

బబుల్ గమ్ మింగితే ఏళ్లపాటు అది కడుపులోనే ఉండిపోతుందనేది అపోహ మాత్రమేనని వైద్యులు తేల్చిచెప్పారు. ‘జీర్ణం కాకపోయినా ఆహారనాళం నుంచి కడుపులోకి, అక్కడి నుంచి పేగుల్లోకి ప్రయాణించి 4-5 రోజుల్లో మలం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇది శరీరంలోని అవయవాలకు ఎక్కడా అతుక్కోదు. కడుపు నొప్పి, వాంతుల లాంటి సమస్యలూ రావు. పొరపాటున మింగితే కంగారు పడాల్సిన పనిలేదు. అలా అని కావాలని మింగొద్దు’ అని డాక్టర్లు చెబుతున్నారు.


