News January 1, 2025
26/11 నిందితుడి అప్పగింతకు US అంగీకారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1735725695407_653-normal-WIFI.webp)
ముంబై తాజ్ హోటల్ మారణకాండ(26/11) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు తహావుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అంగీకరించింది. ముంబై దాడులకు ముందు రాణా రెక్కీ నిర్వహించాడు. అలాగే ప్రధాన సూత్రధారి హెడ్లీకి సాయం చేశాడు. దీంతో అప్పటి నుంచి రాణాను దేశానికి రప్పించేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. US తాజా నిర్ణయంతో త్వరలోనే అతడిని IND తీసుకొచ్చి విచారించనున్నారు.
Similar News
News January 21, 2025
RTCకి సంక్రాంతి ఆదాయం రూ.115కోట్లు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737415287578_782-normal-WIFI.webp)
TG: సంక్రాంతి సందర్భంగా నడిపిన స్పెషల్ బస్సుల ద్వారా ఆర్టీసీకి కాసుల వర్షం కురిసినట్లు సమాచారం. 6వేల ప్రత్యేక బస్సుల ద్వారా అనధికార లెక్కల ప్రకారం రూ.115 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది 5వేల బస్సులు నడపగా, రూ.99కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఈ నెల 10-12, 19,20 తేదీల్లో TGSRTC బస్సుల్లో 50శాతం వరకు ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. రెండ్రోజుల్లో అధికారిక లెక్కలు వెలువడనున్నాయి.
News January 21, 2025
నేటి నుంచి దరఖాస్తులకు మరో అవకాశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737414884792_782-normal-WIFI.webp)
TG: రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు నేటి నుంచి ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను స్వీకరిస్తోంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా ఆయా గ్రామాలకు చేరింది. తమ పేర్లు రాలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి అవకాశమివ్వాలని సర్కారు నిర్ణయించింది. అలాంటివారి నుంచి గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది.
News January 21, 2025
మరో వారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737411956768_782-normal-WIFI.webp)
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మరో వారంపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో టెంపరేచర్ 15°C కంటే తక్కువగా నమోదవుతుండటంతో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.