News November 5, 2024
అమెరికా ఎన్నికల్లో కౌంటింగ్ విధానం
అమెరికా ఎన్నికల్లో పోలైన ఓట్లను ముందుగా లెక్కిస్తారు. తర్వాత పోస్టల్ బ్యాలెట్, అభ్యంతరాలు ఉన్న ఓట్లను, విదేశాల్లో ఉన్నవారి ఓట్లు లెక్కిస్తారు. ఉన్న ఓట్లతో పోలైన ఓట్లను వెరిఫై చేస్తారు. ప్రతి బ్యాలెట్‌ను క్షుణ్నంగా పరిశీలించి డ్యామేజీ, చిరిగిన వాటిని చెల్లని ఓట్లుగా ధ్రువీకరిస్తారు. మొత్తంగా పేపర్ బ్యాలెట్, ఎలక్ట్రానిక్ బ్యాలెట్, మెయిల్-ఇన్ ఓట్లను స్కాన్ చేసి ఫలితాలను లెక్కిస్తారు.
Similar News
News December 9, 2024
మంగళ, శనివారాల్లో సాగర్- శ్రీశైలం లాంచీలు
నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి ఇకపై వారానికి 2 రోజులు లాంచీలు నడవనున్నాయి. ఈ ఏడాది నవంబరులో లాంచీ ట్రిప్పులను ప్రారంభించి, వారానికి ఒక లాంచీ చొప్పున 800మందిని శ్రీశైలం తీసుకెళ్లినట్లు పర్యాటక శాఖ తెలిపింది. ఇక నుంచి మంగళ, శనివారాల్లో లాంచీలు నడుపుతామని పేర్కొంది. ఒకవైపు టికెట్ ధర పెద్దలకు రూ.2వేలు, పిల్లలు(12ఏళ్ల లోపు) రూ.1600, 2వైపులా రూ.3,000..రూ.2వేలుగా నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.
News December 9, 2024
గోకులం: ఉపాధి కూలీల వేతనాల వాటా పెంపు
AP: గోకులం కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధులతో పశువుల కొట్టాలు, గొర్రెల షెడ్లను నిర్మిస్తున్నారు. వీటికి అందించే ఆర్థిక సాయంలో కొంత వాటా కూలీలకు వేతనాల రూపంలో చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పశువుల కొట్టాల నిర్మాణంలో పాల్గొనే కూలీలకు 46 పనిదినాలకు గాను అదనంగా రూ.13,371లు చెల్లించనుంది. అలాగే గొర్రెల షెడ్లకు 67 పని దినాలకు గాను రూ.20,205లు వారి ఖాతాల్లో జమ చేయనుంది.
News December 9, 2024
రేపటి నుంచి వర్షాలు.. 17న మరో ముప్పు
AP: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 11నాటికి నైరుతి బంగాళాఖాతానికి చేరుకొని TN-శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపటి నుంచి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడతాయంది. ఈ నెల 17న అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.