News October 25, 2024
US ELECTIONS: మళ్లీ ఫామ్‌లోకి డొనాల్డ్ ట్రంప్!
అమెరికా అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పుంజుకున్నారు. డెమోక్రాట్ అభ్యర్థి కమలా హ్యారిస్‌పై 2.5 పర్సంటేజీ పాయింట్ల తేడాతో ముందుకెళ్లారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ సర్వేలో 2 వారాలు వీరిద్దరూ నెక్ టు నెక్ పోటీపడ్డారని పొలిటికో సంస్థ తెలిపింది. కమల రేటింగ్ 49% నుంచి 45కు తగ్గగా ట్రంప్ 45 నుంచి 48కి పెరిగారు. ఇలాంటి సిచ్యువేషన్లో విజేత ఎంపికలో స్వింగ్ స్టేట్స్ అత్యంత కీలకమవుతాయని పొలిటికో పేర్కొంది.
Similar News
News November 8, 2024
లంచ్ మోషన్ పిటిషన్లపై కాసేపట్లో విచారణ
AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. దాదాపు 8 లంచ్ మోషన్ పిటిషన్లు ఫైల్ కావడంతో ఇన్ని ఎందుకు దాఖలవుతున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. తమ వాళ్లు కనిపించడం లేదని పిటిషనర్ల తరఫు లాయర్లు న్యాయమూర్తికి వివరించగా, మధ్యాహ్నం 2.30కు విచారిస్తామని జడ్జి తెలిపారు. మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు ఏజీ హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు.
News November 8, 2024
ఆత్మహత్య చేసుకున్న యువ నటుడు
హిందీ TV నటుడు నితిన్ చౌహాన్(35) ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. మరో నటుడు విభూతి ఠాకూర్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. నితిన్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకుంటూ ‘నా ప్రియమైన నితిన్ విశ్రాంతి తీసుకోండి. మీ మరణ వార్త తెలిసి నిజంగా షాక్ అయ్యాను’ అని పేర్కొన్నారు. దాదాగిరి- 2 షో విజేతగా నిలిచిన నితిన్ MTV స్ప్లిట్స్‌విల్లా 5, క్రైమ్ పెట్రోల్ & తేరా యార్ హూన్ మెయిన్ వంటి షోలలో నటించారు.
News November 8, 2024
అరెస్టులను ఖండిస్తున్నాం: KTR
సీఎం రేవంత్ మూసీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు BRS నేతలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ప్రజా పాలన అంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతిసారి మా పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తోంది. ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. మా నేతలను వెంటనే విడుదల చేయాలి’ అని పేర్కొన్నారు.