News January 21, 2025

WHO నుంచి అమెరికా ఎగ్జిట్: ట్రంప్ ఆర్డర్

image

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి తప్పుకుంటున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ పాస్ చేశారు. ప్రస్తుతం ఆ సంస్థకు US అతిపెద్ద డోనర్. తాజా ఆదేశాలతో ఆ సంస్థకు ఇక ఇబ్బందులు తప్పేలా లేవు. తొలి హయాంలో కరోనా వచ్చినప్పుడూ ట్రంప్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. పారిస్ వాతావరణ మార్పు ఒడంబడిక నుంచీ తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఒప్పందం ఒకవైపే ఉందని, న్యాయంగా లేదని పేర్కొన్నారు.

Similar News

News January 3, 2026

మీడియా ముందుకు దేవా

image

TG: రాష్ట్రంలో పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోయినట్లు DGP శివధర్ రెడ్డి పేర్కొన్నారు. కీలక నేతలు బర్సే దేవా, కంకనాల రాజిరెడ్డి, రేమలతో పాటు మరో 17మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. వారు 48 తుపాకులు, 93 మ్యాగ్జిన్లు, 2206 బుల్లెట్స్, రూ.20,30,000 నగదు అప్పగించినట్లు వెల్లడించారు. దేవాపై రూ.75లక్షల రివార్డ్ ఉంది. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా 15 ఏళ్లు పనిచేశారు.

News January 3, 2026

IIIT డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో ఉద్యోగాలు

image

<>IIIT <<>>డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు 10 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి జనవరి 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, డెమాన్‌స్ట్రేషన్, రీసెర్చ్ ప్రజెంటేషన్(PPT), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iiitk.ac.in

News January 3, 2026

కేసీఆర్, జగన్ ఏపీకి మేలు చేయాలని చూశారు: ఉత్తమ్

image

TG: గతంలో కేసీఆర్, జగన్ చర్చించుకొని ఏపీకి మేలు చేయాలని చూశారని మంత్రి ఉత్తమ్ కుమార్ అసెంబ్లీలో PPT సందర్భంగా ఆరోపించారు. ‘గోదావరి జలాలను రాయలసీమకు తీసుకెళ్తామని కేసీఆర్ అన్నారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని చెప్పింది ఆయనే. ఏపీ-తెలంగాణ వేర్వేరు కాదన్నారు. 2015లో కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల వాటాకు అంగీకరించిందే కేసీఆర్ అని’ పునరుద్ఘాటించారు.