News November 6, 2024
US POLLS: ట్రంప్ రెండు, కమల ఒకచోట గెలుపు
అమెరికాలో రాష్ట్రాలవారీగా పోలింగ్ పూర్తవుతోంది. దీంతో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. తాజాగా ఇండియానా(11 ఎలక్టోరల్ ఓట్లు), కెంటకీ(8 ఎలక్టోరల్ ఓట్లు)లో ట్రంప్ విజయం సాధించారు. వెర్మాంట్‌లో కమలా హారిస్(3 ఎలక్టోరల్ ఓట్లు) గెలుపొందారు. అంతకుముందు డిక్స్‌విల్లే నాచ్‌లో చెరో 3 ఎలక్టోరల్ ఓట్ల చొప్పున గెలవడంతో టై అయింది. తొలుత మేజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్లు ఎవరు సాధిస్తారో వారిదే అధ్యక్ష పీఠం.
Similar News
News December 8, 2024
సీఎంను కలిసిన స్టార్ బాయ్ సిద్ధు
TG: DJ టిల్లు హీరో సిద్ధూ జొన్నలగడ్డ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. తండ్రి సాయికృష్ణతో కలిసి సీఎం రేవంత్‌కు రూ.15లక్షల చెక్కును అందించారు. తెలంగాణలో గతంలో సంభవించిన వరదలకు నష్టపోయిన ప్రాంతాలను ఆదుకునేందుకు CMRFకు విరాళంగా ఈ చెక్కును సిద్ధూ ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో సిద్ధూను సీఎం అభినందించారు.
News December 8, 2024
యాప్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక: మంత్రి
TG: గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అర్హులైన పేదలకు వీటిని ఇస్తామని, సంక్రాంతిలోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. లబ్ధిదారులను యాప్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.
News December 8, 2024
కేసీఆర్ వస్తారో.. రారో.. మీరే చూస్తారు: హరీశ్
TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగినట్లు ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సభలో ఎండగడతామని చెప్పారు. రేపటి నుంచి అసెంబ్లీకి కేసీఆర్ వస్తారో.. రారో.. మీరే చూస్తారని చెప్పారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల చట్టబద్ధత, రెండు విడతల రైతు బంధు ఇవ్వాలని పట్టుబడతామన్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.