News February 19, 2025

అదానీపై కేసులో భారత్ సాయం కోరిన అమెరికా

image

గౌతమ్ అదానీ, సాగర్ అదానీపై లంచం కేసులో ఇన్వెస్టిగేషన్‌కు సహకరించాలని భారత్‌ను కోరినట్టు US SEC తెలిపింది. న్యాయ మంత్రిత్వ శాఖను సంప్రదించినట్టు న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టుకు వెల్లడించింది. వారిద్దరూ అమెరికాలో లేరని, భారత్‌లో ఉన్నారని పేర్కొంది. గత ఏడాది గౌతమ్, సాగర్‌పై జో బైడెన్ నేతృత్వంలోని DOJ అభియోగాలు మోపింది. వీటిని అదానీ గ్రూప్ ఖండించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 24, 2025

TTDలో హిందూయేతర ఉద్యోగుల తొలగింపు: BR

image

AP: 2025-26కు గాను ₹5,258Crతో TTD వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. TTDలో పనిచేసే హిందూయేతర ఉద్యోగుల తొలగింపుపై తీర్మానం చేసినట్లు తెలిపారు. జూపార్క్ నుంచి కపిల తీర్థం వరకు ప్రైవేట్ కట్టడాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకోసారి సుపథం దర్శనం కల్పిస్తామని, వృద్ధులు, వికలాంగులకు ఆఫ్‌లైన్‌లో దర్శన టికెట్లు ఇస్తామని పేర్కొన్నారు.

News March 24, 2025

క్యాన్సర్ కేసులపై ప్రచారంలో నిజం లేదు: మంత్రి

image

AP: రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. అనపర్తి నియోజకవర్గంలో 105 మందికి క్యాన్సర్ సోకినట్లు తేలిందని చెప్పారు. బ్రెస్ట్, సర్వైకల్, బ్లడ్, ఓరల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. అనపర్తిని యూనిట్‌గా తీసుకొని ఇప్పటివరకు 1.19 లక్షల మందికి స్క్రీనింగ్ చేశామన్నారు.

News March 24, 2025

SHOCK: 40% స్టూడెంట్ వీసాల్ని రిజెక్ట్ చేసిన US

image

అమెరికాలో చదవాలనుకుంటున్న విద్యార్థులకు షాక్. US అడ్మినిస్ట్రేషన్ రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలను తిరస్కరిస్తోంది. తాజాగా ఈ రిజెక్షన్ రేటు 40%కి చేరడం గమనార్హం. FY2023-24లో 6.79 లక్షల దరఖాస్తులు రాగా అందులో 2.79 లక్షల వీసాలను తిరస్కరించినట్టు తెలిసింది. US జారీ చేసే స్టూడెంట్ వీసాల్లో 90% వరకు F1 ఉంటాయి. 2023లో లక్ష మందికి F1 వీసాలు రాగా 2024 JAN – SEP కాలంలో ఇవి 64,008కి తగ్గిపోయాయి.

error: Content is protected !!