News February 16, 2025
మరో వలసదారుల బ్యాచ్‌ను పంపించిన US

116మంది అక్రమ వలసదారులతో కూడిన మరో విమానాన్ని అమెరికా తాజాగా భారత్‌కు పంపించింది. ఈ విమానం నిన్న రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. తిరిగొచ్చినవారిలో పంజాబ్(65మంది), హరియాణా(33), గుజరాత్(8మంది), యూపీ, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి తలో ఇద్దరు, హిమాచల్, కశ్మీర్ నుంచి చెరొకరు ఉన్నారు. తొలి దఫా వలసదారుల విమానం ఈ నెల 5న వచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News March 19, 2025
6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్: కిషన్ రెడ్డి

TG: 15 నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాల అమలును విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. 6 గ్యారంటీలపై ప్రజలు ఆశలు వదులుకొనేలా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. అంకెల గారడీతో ప్రజలను మరోసారి మోసం చేశారన్నారు. పదేళ్ల పాటు BRS రాష్ట్రాన్ని అగాథంలోకి నెట్టేస్తే, కాంగ్రెస్ తీరు పెనంపై నుంచి పొయ్యిలోకి పడేసినట్లు చేసిందని ధ్వజమెత్తారు.
News March 19, 2025
436 మంది మృతి

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు హమాస్ అంగీకరించకపోవడంతో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. 2 రోజుల్లో 436 మంది పాలస్తీనీయులు మరణించారని గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. ఇందులో 183 మంది పిల్లలు ఉన్నారని వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్‌తో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని హమాస్ ప్రతినిధి ఒకరు చెప్పారు. కాగా 2023 అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకు 61,700 మంది చనిపోయారు.
News March 19, 2025
పెళ్లి చేసుకోనున్న స్టార్ హాకీ ప్లేయర్లు

భారత జాతీయ హాకీ జట్టు ప్లేయర్లు మన్దీప్ సింగ్, ఉదితా దుహాన్‌లు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. మైదానంలో తమ ప్రదర్శనతో దేశం మొత్తం గర్వపడేలా చేసిన ఈ జంట ఈనెల 21న పెళ్లి చేసుకోనున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇప్పటికే పెళ్లికి ముందు జరిగే తంతు ప్రారంభమైనట్లు తెలిపాయి. కరోనా సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహబంధం ప్రేమగా మారింది.