News July 16, 2024
US ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ భార్య తెలుగమ్మాయే!
రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో సెనేటర్ JD వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. దీంతో నవంబర్‌లో జరగబోయే ఎన్నికల్లో ఆయన బరిలో ఉండనున్నారు. కాగా వాన్స్ భార్య ఉషా చిలుకూరి తెలుగు మూలాలున్న వ్యక్తి. ఏపీకి చెందిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. ఉష యేల్ వర్సిటీలో చదివేటప్పుడు వాన్స్‌తో పరిచయమైంది. అది ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Similar News
News October 13, 2024
పూరీ ఆలయంలో భక్తులకు ఉచితంగా ప్రసాదం!
పూరీ జగన్నాథుడి ఆలయంలో భక్తులకు ఉచితంగా మహాప్రసాదాన్ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి పృథ్వీరాజ్ తెలిపారు. దీని వల్ల ఏటా ₹14-15 కోట్ల భారం పడుతుందన్నారు. అయితే, ఉచితంగా ప్రసాదం పంపిణీకి విరాళాలు ఇవ్వడానికి కొంత మంది భక్తులు ముందుకొచ్చినట్టు వెల్లడించారు. కార్తీక మాసం తరువాత అమలు చేసే అవకాశం ఉన్నట్టు మంత్రి తెలిపారు.
News October 13, 2024
రేపు మద్యం దుకాణాలకు లాటరీ
AP: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు అందాయి. రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ఖజానాకు రూ.1,797 కోట్ల ఆదాయం లభించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువ దరఖాస్తులు రావడంతో దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. రేపు లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తారు. ఎల్లుండి ప్రైవేట్ వ్యక్తులకు దుకాణాలు అప్పగిస్తారు. 16 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది.
News October 13, 2024
PM గతిశక్తి ఓ గేమ్ ఛేంజర్: మోదీ
రైల్వే నుంచి విమానాశ్రయాల వరకు 7 కీలక రంగాల సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా ‘PM గతిశక్తి’ దేశ మౌలిక సదుపాయాల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. మల్టీమోడల్ కనెక్టివిటీ పెరిగి వివిధ రంగాల్లో సమర్థవంతమైన పురోగతికి తోడ్పడిందన్నారు. రవాణా వ్యవస్థ మెరుగుపడి ఆలస్యం తగ్గిందని, తద్వారా ఎంతో మంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్నారని మోదీ పేర్కొన్నారు.