News November 7, 2024
US: బాలయ్యకు ఓటు.. నెటిజన్ల విమర్శలు
తాజాగా జరిగిన అమెరికా ఎన్నికల్లో ఓ వ్యక్తి <<14545604>>బాలయ్యకు<<>> ఓటు వేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే దీనిపై విమర్శలొస్తున్నాయి. ఎంతో విలువైన ఓటును ఇలా దుర్వినియోగం చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేసినట్లేనని అభిప్రాయపడుతున్నారు. ఆ ఓటు వేసిన వ్యక్తిపై కేసు వేసి US పౌరసత్వం రద్దు చేస్తే అప్పుడు ఓటు విలువ తెలుస్తుందని మండిపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News December 11, 2024
రియాలిటీ షో కోసం రూ.118 కోట్లు ఖర్చు!
యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన మిస్టర్ బీస్ట్ కొత్త రియాలిటీ షో నిర్వహించనున్నారు. అమెజాన్‌తో కలిసి ఆయన ‘బీస్ట్ గేమ్స్’ పేరుతో కొత్త రియాలిటీ షో కోసం సెట్ నిర్మించేందుకు $14 మిలియన్స్ (రూ.118 కోట్లు) వెచ్చించినట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. ఈ సిరీస్‌లో 10 ఎపిసోడ్స్ ఉంటాయని, విజేతకు 5 మిలియన్ డాలర్లు అందించనున్నట్లు సమాచారం. రియాలిటీ షోల చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రైజ్ మనీగా నిలవనుంది.
News December 11, 2024
మా నాన్న దేవుడు: మనోజ్
TG: కుటుంబం కోసం ఎంతో కష్టపడి పనిచేశానని మంచు మనోజ్ తెలిపారు. ‘మా నాన్న నాకు దేవుడు. ఇవాళ మీరు చూస్తున్న వ్యక్తి కాదు ఆయన. వేరేవాళ్లు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. మా అన్న విష్ణు, వినయ్.. నాన్నపై గన్ను పెట్టి కాలుస్తున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా? అది నచ్చక కుట్ర చేస్తున్నారు. నేను, నా భార్య ఎవరి పనివారు చేసుకుంటున్నాం.’ అని మనోజ్ ఎమోషనల్ అయ్యారు.
News December 11, 2024
జర్నలిస్టుల ధర్నాకు మంచు మనోజ్ మద్దతు
సినీ నటుడు మోహన్ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కూడా పాల్గొని వారికి మద్దతు పలికారు. ‘మా నాన్న తరఫున నేను మీడియాకు క్షమాపణలు చెబుతున్నా. మీడియాపై దాడి దారుణం. ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. నేను ఆయనను ఎలాంటి ఆస్తులు అడగలేదు’ అని ఆయన పేర్కొన్నారు.