News July 25, 2024
ఇండియాలోని ఆ ప్రదేశాలకు వెళ్లొద్దని US హెచ్చరికలు
ఇండియాకు వచ్చే తమ పౌరులకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీలో పలు మార్పులు చేసింది. J&K, PAK బార్డర్, మణిపుర్, ఈశాన్య రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు వెళ్లొద్దంది. టెర్రరిజం, క్రైమ్, హింసను కారణాలుగా చూపింది. తూర్పు లద్దాక్ ప్రాంతం, లేహ్‌కు వెళ్లవచ్చంది. నక్సల్స్ తదితర ప్రభావమున్న తూర్పు MH, ఛత్తీస్‌గఢ్ వెళ్లాలనుకుంటే అనుమతి తీసుకోవాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో US ఎమర్జెన్సీ సేవలు పరిమితంగా ఉన్నాయంది.
Similar News
News October 16, 2024
ఐఏఎస్‌ల పిటిషన్‌పై మధ్యాహ్నం హైకోర్టులో విచారణ
TG: క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఐఏఎస్‌లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మధ్యాహ్నం 2.30గంటలకు వాదనలు విననుంది. ఏపీకి వెళ్లాలంటూ ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్‌ను క్యాట్ ఆదేశించిన విషయం తెలిసిందే.
News October 16, 2024
బియ్యాన్ని నానబెట్టి వండితే..
బియ్యాన్ని నానబెట్టి వండితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.
*జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి, మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
*బియ్యంలోని పోషకాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి.
**ఎక్కువ సేపు నానబెట్టకుండా అరగంట సేపు నానబెడితే చాలని చెబుతున్నారు.
News October 16, 2024
పుట్టకముందే విమానం పేల్చేసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్!
కెనడా ఓ సంచలన విషయం బయటపెట్టిందండోయ్! 39 ఏళ్ల క్రితం అంటే 1985లో AI విమానం 182ను అటాక్ చేసింది 31 ఏళ్ల లారెన్స్ బిష్ణోయ్ అని తేల్చేసింది. ‘పుట్టడానికి ఎనిమిదేళ్ల ముందే మేజర్ టెర్రర్ అటాక్ చేశాడంటే ఎనిమిదేళ్ల వయసులో ఏం చేయగలడో ఊహించుకోవచ్చు’ అని ట్రూడో ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు స్టేట్‌మెంట్ ఇచ్చారు. 9/11 సహా ప్రపంచంలో జరిగిన ప్రతి దాడికీ అతడి కనెక్షన్ ఉందేమోనని USకు చెప్తానని ట్రూడో అన్నారు.