News May 30, 2024

86.5%కి పెరిగిన ₹500 నోట్ల వాడకం

image

₹2వేల నోట్ల ఉపసంహరణ ప్రభావంతో ₹500 నోట్ల వాడకం 86.5%కి చేరిందని ఆర్బీఐ వెల్లడించింది. గత ఏడాది ఇది 77.1%గా ఉండగా.. మే 2023లో ₹2వేల నోట్ల ఉపసంహరణ ప్రకటనతో అమాంతం పెరిగిందని తెలిపింది. 2024 మార్చి 31కి వాడుకలో ₹500(5.16 లక్షల నోట్లు)టాప్ ప్లేస్‌లో ఉండగా.. ₹10 నోట్లు(2.49 లక్షల నోట్లు) రెండో స్థానంలో ఉన్నట్లు వివరించింది.

Similar News

News October 14, 2024

PhonePe.. ఒక్క నెలలో 722 కోట్ల ట్రాన్సాక్షన్స్

image

యూపీఐ యాప్స్‌లో ఫోన్ పే హవా కొనసాగుతోంది. SEPలో 48% మార్కెట్ షేర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. గత నెలలో రూ.10.30 లక్షల కోట్ల విలువైన 722 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఆ తర్వాత గూగుల్ పే 37.4%, పేటీఎం 7%, ఇతర యాప్స్ 7.6% ఉన్నాయి. ఈ వివరాలను National Payments Corporation of India (NPCI) వెల్లడించింది. మరి మీరు ఏ యూపీఐ యాప్ వాడుతున్నారు? కామెంట్ చేయండి.

News October 14, 2024

పంచాయతీలను జగన్ నిర్వీర్యం చేశారు: నిమ్మల

image

AP: సంక్రాంతిలోపు 3వేల కి.మీల సిమెంట్ రోడ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోరింటాడలో పల్లెపండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీ నిధుల్ని దారి మళ్లించిన జగన్ చరిత్రలో ద్రోహిగా మిగిలిపోయారని విమర్శించారు. పంచాయతీలను నిర్వీర్యం చేసి, సర్పంచులను భిక్షాటన చేసే దుస్థితికి తెచ్చారని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందన్నారు.

News October 14, 2024

డీఎస్సీ ఫ్రీ కోచింగ్.. ఆ అభ్యర్థులకు గమనిక

image

AP: డీఎస్సీ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం ఈ నెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అప్లై చేసిన వారు జ్ఞానభూమి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలంది. ఈ నెల 27న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపింది. అర్హులను ఎంపిక చేసి శిక్షణ అందిస్తామంది.