News October 31, 2024

టీస్పూన్ కన్నా ఎక్కువ ఉప్పు వాడుతున్నారా?

image

రోజుకు 2gms కన్నా తక్కువ సోడియం తీసుకుంటే పదేళ్లలో 3 లక్షల మరణాలను అడ్డుకోవచ్చని WHO తెలిపింది. ఒక టీస్పూన్ లేదా 5gms కన్నా తక్కువ ఉప్పు తీసుకోవాలని సూచించింది. దీంతో 17 లక్షల హార్ట్ అటాక్స్/స్ట్రోక్స్, 7 లక్షల కిడ్నీ రోగాలను అడ్డుకోవచ్చని వెల్లడించింది. పైగా $80 మిలియన్లను ఆదా చేసుకోవచ్చని తెలిపింది. అధిక, మధ్య ఆదాయ దేశాల్లో పరిమితికి మించి ఉప్పు వాడుతున్నారని వార్నింగ్ ఇచ్చింది. మరి మీరేమంటారు?

Similar News

News February 2, 2026

ఆన్‌లైన్ వేధింపులు ఎలా ఎదుర్కోవాలంటే?

image

టెక్నాలజీ పెరిగే కొద్దీ డిజిటల్ ప్రపంచంలో మోసాలూ, మహిళలపై వేధింపులూ పెరుగుతున్నాయి. ఈ విషవలయంలో అతివలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. తెలిసినవారేనని ఫొటోలు, వీడియోలు పంపకూడదు. పాస్‌వర్డ్‌లు ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. థర్డ్‌పార్టీ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. వెబ్‌క్యామ్‌ను ఎప్పుడూ ఆఫ్‌ చేసి ఉంచండి. సైబర్‌ నేరాల బాధితులైతే సహాయం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కి డయల్‌ చేయండి.

News February 2, 2026

డబుల్ లవ్.. డబుల్ జాయ్: చెర్రీకి అల్లు అర్జున్ కంగ్రాట్స్

image

<<19016319>>కవలలకు<<>> జన్మనిచ్చిన రామ్ చరణ్-ఉపాసనకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ‘మరోసారి తల్లిదండ్రులుగా మారినందుకు కంగ్రాట్స్. చిరంజీవి, చిట్టిక(క్లీంకార) ముఖంలో ఆనందం వెల్లివిరిస్తోంది. ఫ్యామిలీని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. ట్విన్స్ ఈ ప్రపంచంలోకి వస్తూనే ఎంతో ఆనందాన్ని తెచ్చారు. డబుల్ లవ్.. డబుల్ జాయ్’ అని ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు ఈ పోస్టును వైరల్ చేస్తున్నారు.

News February 2, 2026

IAFలో అగ్నివీర్ వాయు పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు పోస్టులకు అప్లై చేయడానికి గడువును పొడిగించారు. FEB 1 తేదీ ఆఖరు తేదీ కాగా.. FEB 8 వరకు పెంచారు. డిప్లొమా, ఇంటర్, టెన్త్ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు జనవరి 1, 2006-జులై1, 2009 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎత్తు 152సెం.మీ. ఉండాలి. సైట్: https://iafrecruitment.edcil.co.in