News October 31, 2024
టీస్పూన్ కన్నా ఎక్కువ ఉప్పు వాడుతున్నారా?
రోజుకు 2gms కన్నా తక్కువ సోడియం తీసుకుంటే పదేళ్లలో 3 లక్షల మరణాలను అడ్డుకోవచ్చని WHO తెలిపింది. ఒక టీస్పూన్ లేదా 5gms కన్నా తక్కువ ఉప్పు తీసుకోవాలని సూచించింది. దీంతో 17 లక్షల హార్ట్ అటాక్స్/స్ట్రోక్స్, 7 లక్షల కిడ్నీ రోగాలను అడ్డుకోవచ్చని వెల్లడించింది. పైగా $80 మిలియన్లను ఆదా చేసుకోవచ్చని తెలిపింది. అధిక, మధ్య ఆదాయ దేశాల్లో పరిమితికి మించి ఉప్పు వాడుతున్నారని వార్నింగ్ ఇచ్చింది. మరి మీరేమంటారు?
Similar News
News November 9, 2024
‘హాట్’ యోగా అంటే?
ఒక గదిలో సాధారణం కంటే అధిక టెంపరేచర్‌ను మెయింటేన్ చేస్తూ చేసేదే ‘హాట్’ యోగా. దీనివల్ల కేలరీలు అధికంగా ఖర్చై బరువు తగ్గుతారని నమ్మకం. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని యోగా నిపుణులు చెబుతున్నారు. హాట్ యోగా వల్ల డీహైడ్రేషనై శరీరంలోని ఫ్లూయిడ్ అంతా ఆవిరైపోతుందని చెబుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో చర్మ సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. హాట్ యోగా చలి అధికంగా ఉండే దేశాల్లోని ప్రజల కోసమని పేర్కొన్నారు.
News November 9, 2024
రాహుల్ దిశానిర్దేశంలేని క్షిపణి: అస్సాం సీఎం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నియంత్రణ లేదంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలు మండిపడ్డారు. ‘రాహుల్ ప్రస్తుతం నియంత్రణ లేని క్షిపణిలా ఉన్నారు. సోనియా శిక్షణనివ్వకపోతే మున్ముందు దారీతెన్నూ లేని క్షిపణిగా మారతారు. ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. ఝార్ఖండ్‌కు వచ్చిన రాహుల్ తీవ్రవాదుల గురించి ఒక్క ముక్కా మాట్లాడలేదు. ఆయన గిరిజనులకు, వెనుకబాటు వర్గాలకు వ్యతిరేకి’ అని విమర్శించారు.
News November 9, 2024
ప్రియాంకా చోప్రా నాకు రోల్ మోడల్: సమంత
ప్రియాంకా చోప్రా తనకు రోల్ మోడల్ అని నటి సమంత వెల్లడించారు. బిజినెస్ టుడే నిర్వహించిన ‘మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘సిటాడెల్ తొలి సీజన్ అమెరికాలో, రెండోది ఇటలీ, మూడోది భారత్, తర్వాత మెక్సికోలో జరుగుతుంటుంది. అమెరికా వెర్షన్‌లో ప్రియాంక నటించగా ఇండియా వెర్షన్‌లో నాకు అవకాశం దక్కింది. ప్రియాంక ఓ రోల్ మోడల్. గొప్పగా ఆలోచించడమనేది ఆమెనుంచే నేర్చుకుంటున్నా’ అని కొనియాడారు.