News September 5, 2024
MS WORD వాడుతున్నారా?
కంప్యూటర్ ఉపయోగించే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో MS WORDతో పని పడుతుంది. అయితే, ఇంపార్టెంట్ మేటర్‌ని టైప్ చేశాక సేవ్ చేయకముందే అనుకోకుండా క్లోజ్ కావడంతో టెన్షన్ పడుతుంటారు. అలాంటి వారికి ఈ టెక్నిక్ ఉపయోగపడొచ్చు. ఎప్పుడైనా సేవ్ చేయకుండా ఎగ్జిట్ అయితే ఇలా చేయండి. ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లోకి వెళ్లి MY PC/THIS PCని ఓపెన్ చేసి సెర్చ్‌లో .ASD టైప్ చేస్తే అందులో ఈ ఫైల్ కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News September 9, 2024
విజయ్ కొడుకు డైరెక్షన్‌లో సందీప్ కిషన్?
తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్‌తో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జేసన్‌కు డైరెక్టర్‌గా ఇది తొలి సినిమా కావడం గమనార్హం. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News September 9, 2024
ప్రకాశం బ్యారేజ్ బోట్ల కేసు.. నిందితుడు లోకేశ్ సన్నిహితుడే: వైసీపీ
AP: వరదల్లో ప్రకాశం బ్యారేజ్ వద్దకు బోట్లు కొట్టుకొచ్చిన కేసు నిందితుడు మంత్రి లోకేశ్ సన్నిహితుడేనని YCP ఆరోపించింది. ‘ఈ కేసులో కోమటి రామ్మోహన్, ఉషాద్రిలను CBN ఆదేశాలతో పోలీసులు అరెస్టు చేశారు. రామ్మోహన్ TDP ఎన్నారై విభాగం అధ్యక్షుడు కోమటి జయరాంకు బంధువు. ఉషాద్రికి లోకేశ్‌తో సంబంధాలున్నాయనే దానికి ఈ ఫొటోనే సాక్ష్యం. వరద బాధితుల కోపాన్ని డైవర్ట్ చేయడానికి TDP ప్రయత్నిస్తోంది’ అని ట్వీట్ చేసింది.
News September 9, 2024
BREAKING: తీరం దాటిన వాయుగుండం
AP: ఉత్తరాంధ్రను వణికిస్తోన్న తీవ్ర వాయుగుండం పూరీ సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో నిన్నటి నుంచి కోస్తా, ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని గంటల పాటు ఈ ప్రభావం ఉండనుంది. వాయుగుండం క్రమేపి బలహీనపడుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.