News February 5, 2025
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ వార్నింగ్

TG: బీసీ కులగణనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కోసమే రేపు సీఎం రేవంత్‌తో సమావేశం కానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజల అపోహలు తొలగించడమే తమ లక్ష్యమని చెప్పారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర కులగణనపై అనవసర రాద్ధాంతం చేయొద్దన్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News December 4, 2025
అల్లూరి: యువకుడిపై పోక్సో కేసు నమోదు

గూడెం కొత్తవీధి మండలానికి చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీలేరు ఎస్ఐ యాసీన్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మండలానికి చెందిన బాలికను స్థానిక యువకుడు నమ్మించి మోసగించి అత్యాచారం చేసినట్లు ఆరోపిస్తూ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
News December 4, 2025
ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటాం: పవన్

AP: కాకినాడ(D) ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటామని వారితో సమావేశం సందర్భంగా Dy.CM పవన్ అన్నారు. ‘సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన చేస్తాం. జాలర్ల ఆదాయం పెంపు, మత్స్య సంపద వృద్ధి, తీర ప్రాంత రక్షణ, యువత, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాధనం వృథా అయింది. చేసిన పనులే చేయాల్సిన దుస్థితిని అప్పటి పాలకులు తెచ్చారు’ అని ఆరోపించారు.
News December 4, 2025
జెరుసలేం మాస్టర్స్ విజేతగా అర్జున్ ఇరిగేశీ

భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశీ సత్తా చాటారు. ఫైనల్లో మాజీ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి జెరుసలేం మాస్టర్స్-2025 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. తొలుత రెండు ర్యాపిడ్ గేమ్‌లు డ్రా కాగా మొదటి బ్లిట్జ్ గేమ్‌లో విజయం సాధించారు. అర్జున్‌కు టైటిల్‌తో పాటు దాదాపు రూ.50లక్షల (USD 55,000) ప్రైజ్ మనీ అందజేయనున్నారు. ఈ 22ఏళ్ల కుర్రాడి స్వస్థలం తెలంగాణలోని హన్మకొండ.


