News February 5, 2025
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ వార్నింగ్

TG: బీసీ కులగణనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కోసమే రేపు సీఎం రేవంత్‌తో సమావేశం కానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజల అపోహలు తొలగించడమే తమ లక్ష్యమని చెప్పారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర కులగణనపై అనవసర రాద్ధాంతం చేయొద్దన్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News January 19, 2026
ఏ చర్మానికి ఏ ఫేస్‌వాష్ వాడాలంటే..

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఫేస్‌వాష్‌లు ఉన్నాయి. వీటిల్లో మీ చర్మానికి సరిపోయేదాన్ని ఎంచుకోవాలి. హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, నియాసినమైడ్ కలిగి ఉన్న ఫేస్‌వాష్‌లు చర్మానికి మేలు చేస్తాయి. ఇవి ముఖానికి తేమను అందించి పొడిదనాన్ని తగ్గిస్తాయి. ఆయిలీ స్కిన్ ఉన్నవారు సాలిసిలిక్ యాసిడ్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిగిన ఫేస్‌వాష్, డ్రై స్కిన్ ఉన్నవారు ఆల్మండ్, ఆలీవ్ ఆయిల్ ఉన్న ఫేస్‌వాష్ ఉపయోగిస్తే మంచిది.
News January 19, 2026
జీడీపీ వృద్ధి 7.3 శాతం: మూడీస్

ఈ ఏడాది భారత్ GDP వృద్ధి 7.3%కి చేరుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ అంచనా వేసింది. అదే విధంగా కుటుంబ ఆదాయాలు పెరిగి బీమా రంగానికి మంచి డిమాండ్ ఏర్పడుతుందని తెలిపింది. బీమా సంస్థల ప్రీమియం మరింత పెరుగుతుందని పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బీమా ప్రీమియం ఆదాయం గణనీయంగా పెరిగి, లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగాలు కీలకంగా నిలిచాయని స్పష్టం చేసింది.
News January 19, 2026
పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం రిపోర్టుపై హైకోర్టులో విచారణ

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై PC ఘోష్ కమిషన్ నివేదికపై KCR, హరీశ్, స్మితా సబర్వాల్, SK జోషి దాఖలు చేసిన పిటిషన్లను HC విచారించింది. కేసీఆర్, హరీశ్ తరఫున అడ్వకేట్ సుందరం వాదనలు వినిపించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై పిటిషనర్లు రిప్లై ఫైల్ చేశారు. దీనిపై ప్రభుత్వం రిప్లై ఇవ్వడానికి టైమ్ కావాలని AG కోరారు. FEB 20లోపు లిఖితపూర్వకంగా ఇవ్వాలంటూ తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు కోర్టు వాయిదా వేసింది.


