News January 8, 2025
ఇస్రో కొత్త ఛైర్మన్గా వి.నారాయణన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) కొత్త ఛైర్మన్గా డా.వి.నారాయణన్ నియమితులయ్యారు. ఈమేరకు ఇస్రో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 14న నారాయణన్ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్గా ఎస్.సోమనాథ్ ఉన్నారు. ఆయన సారథ్యంలోనే చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది.
Similar News
News January 8, 2025
చాహల్తో విడాకుల ప్రచారం.. ఇన్స్టాలో ధనశ్రీ పోస్ట్
చాహల్తో విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం నేపథ్యంలో ధనశ్రీ ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఫ్యామిలీతో పాటు తాను కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నానని అన్నారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వస్తున్న నిరాధార కథనాలు బాధిస్తున్నాయని తెలిపారు. కొన్ని ఏళ్లపాటు కష్టపడి మంచి పేరు సంపాదించుకున్నట్లు పేర్కొన్నారు. విలువలకు కట్టుబడి వాస్తవంపై దృష్టి పెట్టి ముందుకెళ్తానని పేర్కొన్నారు.
News January 8, 2025
అందుకే బీర్ల ధరలు పెంచలేదు: మంత్రి జూపల్లి
TG: యునైటెడ్ బ్రూవరీస్ చెప్పినట్లు బీర్ల ధరలు 33 శాతం పెంచితే వినియోగదారులపై భారం పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందుకే ఆ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ‘ధరల పెంపు కోసం ఓ కమిటీ వేశాం. కమిటీ సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. బీర్ల మార్కెట్లో యునైటెడ్ బ్రూవరీస్ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆ కంపెనీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు’ అని ఆయన వివరించారు.
News January 8, 2025
పృథ్వీ షా కఠోర సాధన: పిక్స్ వైరల్
టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా కఠోర సాధన చేస్తున్నారు. ఫిట్నెస్ మెరుగుపరుచుకునేందుకు ఆయన మైదానం, జిమ్లోనూ కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ట్రాక్పై పరిగెత్తుతూ, జిమ్లో వర్కౌట్ చేస్తూ, టెన్నిస్ ఆడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పృథ్వీ SMలో పంచుకున్నారు. కాగా జాతీయ జట్టుతోపాటు దేశవాళీ జట్టులో కూడా షా చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐపీఎల్లో కూడా ఆయనను ఏ ఫ్రాంచైజీ కొనలేదు.