News April 2, 2024

ట్విటర్ ట్రెండింగ్‌లో ‘వడాపావ్’

image

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం పొందింది. సొంత గడ్డపై ముంబై ప్లేయర్లు డకౌట్ అవడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఎక్కువ సార్లు జీరో డిజిట్‌కే వెనుదిరగడంతో ‘వడాపావ్’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. వరుసగా ఓడిపోతున్నప్పటికీ ప్లేయర్లు గెలవాలన్న కసితో ఆడట్లేదని విమర్శిస్తున్నారు. దీంతో ‘వడాపావ్’ హాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండవుతోంది.

Similar News

News March 21, 2026

వచ్చే వారం భీకర దాడులు: ఇజ్రాయెల్

image

పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించట్లేదు. వచ్చే వారం ఇరాన్‌పై దాడుల తీవ్రతను పెంచుతామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ వెల్లడించారు. ఇరాన్ అడ్మినిస్ట్రేషన్, కమాండర్లు, కీలక స్థావరాలను టార్గెట్ చేస్తామన్నారు. ఇరాన్‌పై దాడులను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే కట్జ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

News March 21, 2026

ఆకాశంలోనే జీవితం.. కాపురం కూడా!

image

ప్రకృతిలో ‘కామన్ స్విఫ్ట్’ అనే పక్షి ఓ అద్భుతం. ఏకధాటిగా 10 నెలల పాటు భూమిపై వాలకుండా ఆకాశంలోనే జీవించగలిగే సామర్థ్యం దీని సొంతం. వింత ఏమిటంటే.. ఇది గాలిలోనే ఆహారం తింటుంది, జతకడుతుంది, చివరికి ఎగురుతూనే నిద్రపోతుంది. కేవలం గుడ్లు పెట్టడానికి మాత్రమే ఈ పక్షి నేలపైకి వస్తుంది. మెదడులో సగభాగాన్ని అలర్ట్‌గా ఉంచి గాల్లోనే నిద్రపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 21, 2026

అంగారకుడిపై ఒకప్పుడు పుష్కలంగా నీళ్లు!

image

మానవులు జీవించడానికి అనుకూలమైన గ్రహాన్ని అన్వేషించడంలో కీలక పురోగతి లభించింది. అంగారకుడిపై ఒకప్పుడు నీరు పుష్కలంగా ప్రవహించిందనడానికి నాసా సైంటిస్టులు కొత్త ఆధారాలు కనుగొన్నారు. నాసా 2020లో ప్రయోగించిన Perseverance రోవర్ మార్స్‌లోని జెజెరో క్రేటర్‌లో 6.1KM ప్రయాణించి 35M లోతున భౌగోళిక నిర్మాణాలను విశ్లేషించింది. అక్కడ 3.7-4.2 బిలియన్ ఏళ్ల కిందట ఓ సరస్సు ఉండేదని నిర్ధారించింది.