News August 14, 2024
హైకోర్టులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే 23 మంది అరెస్ట్ కాగా వంశీ ఏ71గా ఉన్నారు. ఆయనపై దాడి కేసుతో పాటు హత్యాయత్నం అభియోగాలున్నాయి.
Similar News
News December 10, 2025
IIM రాంచీలో నాన్ టీచింగ్ పోస్టులు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాంచీ(IIM) 5 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, LLB, M.Phil/MA క్లినికల్ సైకాలజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://iimranchi.ac.in
News December 10, 2025
అమెజాన్ భారీ పెట్టుబడులు.. 10 లక్షల ఉద్యోగాలు

ఇండియాలో ఈ-కామర్స్ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని అమెజాన్ మరో 35 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి 10 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. మరోవైపు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల ఈ-కామర్స్ ఎగుమతులను $80B వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌ను కీలకమైన మార్కెట్‌గా భావిస్తోన్న అమెజాన్.. ఇప్పటివరకు మన దేశంలో దాదాపు 40B డాలర్ల పెట్టుబడి పెట్టింది.
News December 10, 2025
మీరేం చేస్తున్నారు?: కేంద్రంపై మండిపడ్డ ఢిల్లీ HC

ఇండిగో విషయంలో కేంద్రం స్పందనపై ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ప్రయాణికుల కోసం ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలేంటి?’ అని ప్రశ్నించింది. అటు ఇదే టైమ్ అని ఇతర సంస్థలు డొమెస్టిక్ ఛార్జీలు ₹40వేలకు పెంచడాన్ని తప్పుబట్టింది. వారిని కట్టడి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేయగా నోటీస్ ఇవ్వడంతో సారీ చెప్పాయని ప్రభుత్వ లాయర్ బదులిచ్చారు. దీంతో మీరు సరిగా స్పందిస్తే ఈ పరిస్థితి వస్తుందా? అని నిలదీసింది.


