News August 14, 2024

హైకోర్టులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే 23 మంది అరెస్ట్ కాగా వంశీ ఏ71గా ఉన్నారు. ఆయనపై దాడి కేసుతో పాటు హత్యాయత్నం అభియోగాలున్నాయి.

Similar News

News September 17, 2024

రిలీజ్‌కు ముందే చరిత్ర సృష్టించిన ‘దేవర’

image

జూ.ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటించిన ‘దేవర’ మూవీ చరిత్ర సృష్టించింది. అమెరికా అడ్వాన్స్ ప్రీమియర్ టికెట్ సేల్స్‌లో అత్యంత వేగంగా $1.75M సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచినట్లు మేకర్స్ వెల్లడించారు. అలాగే 10 రోజుల్లోనే 45 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలిపారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ట్రైలర్, పాటలు మూవీపై అంచనాలను పెంచేశాయి.

News September 17, 2024

వడ్డీరేటును ఎంత తగ్గిస్తుందో?

image

ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు వేయికళ్లతో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. US ఫెడ్ వడ్డీరేటును ఎంతమేర తగ్గిస్తుందోనని ఆత్రుతగా చూస్తున్నారు. బుధవారం ముగిసే సమావేశాల్లో ఫెడ్ ఛైర్ జెరోమ్ పావెల్ వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తారని రాయిటర్స్ అంచనా వేసింది. కనీసం 25 బేసిస్ పాయింట్ల కోత కచ్చితంగా ఉంటుందని అనలిస్టుల మాట. అదే జరిగితే గ్లోబల్ స్టాక్ మార్కెట్లు రాకెట్లలా దూసుకెళ్లడం ఖాయం.

News September 17, 2024

జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు.. స్పందించిన చిన్మయి

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణలపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ ‘రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడు. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చిన్మయి ట్వీట్ చేశారు. కాగా ఆమె గతంలో రచయిత వైరముత్తు, సింగర్ కార్తీక్‌పై వేధింపుల ఆరోపణలు చేశారు.