News March 20, 2024
ఏప్రిల్ 1 నుంచి టెన్త్ జవాబుపత్రాల వాల్యుయేషన్
AP: టెన్త్ జవాబుపత్రాల వాల్యుయేషన్ ఏప్రిల్ 1 నుంచి చేపట్టనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆ రోజు నుంచి ఎనిమిది రోజులపాటు నిరంతరాయంగా మూల్యాంకనం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. మంగళవారం జరిగిన రెండో భాష పరీక్షకు 97.05% మంది హాజరయ్యారు. ఈ నెల 30వ తేదీతో టెన్త్ పరీక్షలు ముగియనున్నాయి.
Similar News
News November 25, 2024
చైతూ, శోభిత పెళ్లి అక్కడే ఎందుకంటే?
నాగ చైతన్య, శోభిత పెళ్లి డిసెంబర్ 4న జరగనుంది. ఎలాంటి ఆడంబరం లేకుండా వేడుక జరగనుండగా, వారిద్దరే దగ్గరుండి పనులు చూసుకుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి నిర్వహించాలని ఫ్యామిలీ నిర్ణయించినట్లు చైతూ తెలిపారు. అక్కడున్న ANR విగ్రహం ముందు పెళ్లి జరిగితే ఆయన ఆశీర్వాదాలు ఉంటాయని సెంటిమెంట్‌గా భావిస్తున్నట్లు చెప్పారు. శోభితతో కొత్త జీవితం ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నట్లు చైతన్య వివరించారు.
News November 25, 2024
తొలి రోజు ముగిసిన ఐపీఎల్ వేలం
ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు ముగిసింది. రేపు కూడా ఆక్షన్ కొనసాగనుంది. ఐపీఎల్ చరిత్రలోనే వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా రిషభ్ పంత్(రూ.27 కోట్లు-LSG) నిలిచారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(రూ.26.75కోట్లు-PBKS) నిలిచారు. మొత్తం 72 మంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. ఇంకా డుప్లెసిస్, విలియమ్సన్, సామ్ కరన్, భువనేశ్వర్, సుందర్, డేవిడ్ వంటి ప్లేయర్ల భవితవ్యం రేపు తేలనుంది.
News November 25, 2024
IPL మెగా వేలం UPDATES
→ రసిఖ్‌ధర్‌ను రూ.6కోట్లకు కొన్న RCB
→ అబ్దుల్ సమద్‌ను రూ.4.20కోట్లకు దక్కించుకున్న LSG
→ అశుతోశ్ శర్మకు రూ.3.80కోట్లు ఖర్చు చేసిన DC
→ మోహిత్ శర్మను రూ.2.20కోట్లకు సొంతం చేసుకున్న DC
→ మహిపాల్ లామ్రోర్‌ను రూ.1.70కోట్లకు కొన్న GT
→ హర్‌ప్రీత్ బ్రార్‌ను రూ.1.50కోట్లకు కొన్న PBKS
→ విజయ్ శంకర్‌ను రూ.1.20కోట్లకు సొంతం చేసుకున్న CSK
→ ఆకాశ్ మద్వల్‌ను రూ.1.20 కోట్లకు కొన్న RR