News March 20, 2024
ఏప్రిల్ 1 నుంచి టెన్త్ జవాబుపత్రాల వాల్యుయేషన్
AP: టెన్త్ జవాబుపత్రాల వాల్యుయేషన్ ఏప్రిల్ 1 నుంచి చేపట్టనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆ రోజు నుంచి ఎనిమిది రోజులపాటు నిరంతరాయంగా మూల్యాంకనం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. మంగళవారం జరిగిన రెండో భాష పరీక్షకు 97.05% మంది హాజరయ్యారు. ఈ నెల 30వ తేదీతో టెన్త్ పరీక్షలు ముగియనున్నాయి.
Similar News
News September 16, 2024
అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్‌తోనే!
‘పుష్ప-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ పూర్తికాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలైనట్లు తెలిపాయి. అయితే, త్రివిక్రమ్ కాకుండా మరో డైరెక్టర్‌తో సినిమా రాబోతోందనేది పూర్తిగా అవాస్తవమని, వాటిని నమ్మొద్దని చెప్పాయి. దీనిపై బన్నీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
News September 16, 2024
వర్సిటీలను ప్రక్షాళన చేయనున్నాం: లోకేశ్
AP: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్ని సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విటర్‌లో తెలిపారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు వెల్లడించారు. వర్సిటీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆసక్తి ఉన్న ఆచార్యులు ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News September 16, 2024
బైడెన్, కమలను చంపేందుకు ఎవరూ ట్రై చేయట్లేదు: మస్క్
US అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం పట్ల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ట్రంప్‌ను ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు ‘బైడెన్, కమలను చంపాలని ఎవరూ కనీసం ప్రయత్నించడం లేదు’ అని సమాధానమిచ్చారు. ట్రంప్‌కు మస్క్ చాలాకాలంగా బహిరంగంగానే మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే. అటు ట్రంప్ 2సార్లు ప్రమాదాన్ని తప్పించుకోవడంతో అమెరికావ్యాప్తంగా ఆయనకు సానుభూతి పెరుగుతోంది.