News September 23, 2024
ఖాళీగా వందేభారత్.. ఇప్పుడైనా హాల్టింగ్ ఇవ్వాలని డిమాండ్

సికింద్రాబాద్-నాగ్పూర్ మధ్య ఇటీవల ప్రారంభించిన వందేభారత్ రైలుకు ఆక్యుపెన్సీ ఆశించినంతగా లేదు. మొత్తం 1328 సీట్లలో దాదాపు 1110 సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. రైలు ఆక్యుపెన్సీ 15.81% మించడం లేదు. ప్రస్తుతం TGలోని ఖాజీపేట, రామగుండం స్టేషన్లలోనే ఆగుతున్న ఈ రైలుకు మంచిర్యాల, పెద్దపల్లి, కాగజ్నగర్లో హాల్టింగ్ సౌకర్యం ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో రైలు ఆక్యుపెన్సీ పెరుగుతుందని చెబుతున్నారు.
Similar News
News December 5, 2025
పిల్లలు సినిమాల పిచ్చిలో పడకూడదు: పవన్

AP: సినిమాలు వినోదంలో ఓ భాగం మాత్రమేనని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. పిల్లలు ఆ సినిమాల పిచ్చిలో పడకుండా చూడాలని PTMలో పేరెంట్స్కి సూచించారు. గతంలో చదువుల కోసం దాతలు వందల ఎకరాలు దానమిచ్చారని గుర్తు చేశారు. నేడు ఉన్న స్థలాలు దోచుకుపోయే పరిస్థితి ఉందని, స్కూళ్లకు గ్రౌండ్స్ లేకపోవడం విచారకరమన్నారు. ‘సోషల్ టీచర్ చెప్పిన పాఠాలు నా గుండెలో నాటుకుపోయాయి. అవే నాలో సామాజిక బాధ్యతను పెంచాయి’ అని అన్నారు.
News December 5, 2025
వేప పిండి, పిడకల ఎరువుతో ప్రయోజనాలు

☛ ఒక టన్ను వేప పిండిని దుక్కిలో(లేదా) పంట పెట్టిన తర్వాత వేస్తే 52 నుంచి 55KGల నత్రజని, 10KGల భాస్వరం, 14-15KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి.
☛ బాగా పొడిచేసిన పిడకల ఎరువు(36-40 బస్తాలు)ను సాగు భూమిలో వేస్తే 5-15KGల నత్రజని, 3-9KGల భాస్వరం, 5-19KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. వేపపిండిలోని పోషకాల శాతం భూమికి అదనపు బలాన్నిచ్చి, చీడపీడలు, తెగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.
News December 5, 2025
స్మృతి మంధాన ఎంగేజ్మెంట్ రింగ్ ఎక్కడ?

తన వివాహం వాయిదా పడిన తర్వాత క్రికెటర్ స్మృతి మంధాన చేసిన తొలి ఇన్స్టా పోస్ట్ చర్చనీయాంశమైంది. ఓ యాడ్ షూట్ వీడియోను ఆమె షేర్ చేయగా.. అందులో స్మృతి చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించకపోవడాన్ని ఫ్యాన్స్ గుర్తించారు. దీంతో ఉంగరం ఎక్కడుందని, పెళ్లి రద్దయిందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ కొత్త వివాహ తేదీపై ప్రకటన చేయకపోవడం, రింగ్ తీసేయడం ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయని చెబుతున్నారు.


