News June 26, 2024
ఆగస్టు 15 నుంచి వందేభారత్ స్లీపర్!

మన దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలును ఆగస్టు 15 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ముంబై వరకు గుజరాత్ మీదుగా ఈ ట్రైన్ పరుగులు తీయనున్నట్లు సమాచారం. స్లీపర్ ట్రైన్ కోచ్లు బెంగళూరులో తుదిరూపు దిద్దుకుంటున్నాయి. ఈ రైలు తొలుత గంటకు 130 కి.మీ వేగంతో వెళ్లనుందని, ఆ తర్వాత వేగాన్ని గంటకు 160-220 కి.మీ వరకు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News November 17, 2025
డిసెంబర్లో స్థానిక ఎన్నికలు.. క్యాబినెట్ నిర్ణయం!

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని డిసైడ్ అయింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. దీంతో డిసెంబర్లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

ఢిల్లీ పేలుళ్ల కేసు… నేపాల్లో మొబైళ్లు, కాన్పూర్లో సిమ్ల కొనుగోలు

ఢిల్లీ పేలుళ్ల కేసులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద పేలుళ్లకు 4 వారాల ముందే ఉమర్ బ్లూప్రింట్ రూపొందించాడు. ఇందుకు నేపాల్లో పాత మొబైళ్లను, కాన్పూర్లో సిమ్ కార్డుల్ని కొన్నాడు. సిమ్ల కోసం ID కార్డులందించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా పేలుడుకు ముందు ఉమర్తో ముగ్గురు డాక్టర్లు కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు. ఇందులో ఒకరైన పర్వేజ్ నిందితురాలు డా.షహీన్కు సోదరుడు.