News September 17, 2024
‘వందే మెట్రో ఛార్జీలు ఏసీ బస్సు కంటే తక్కువ’
భుజ్-అహ్మదాబాద్ స్టేషన్ల మధ్య నమో భారత్ ర్యాపిడ్ రైలును ఇవాళ PM మోదీ ప్రారంభించారు. ఇందులో ఛార్జీలు ఈ మార్గంలో ప్రయాణించే AC, నాన్ AC బస్సుల కంటే తక్కువేనని పశ్చిమ రైల్వే CPRO వినీత్ అభిషేక్ తెలిపారు. ‘భుజ్ నుంచి గాంధీ ధామ్ ఏసీ బస్సు టికెట్ ధర రూ.140, నాన్ ఏసీ బస్సు రూ.110గా ఉంది. కానీ ఈ రైలు టికెట్ ధర రూ.75 మాత్రమే. బస్సు ప్రయాణానికి 2 గంటలు పడుతుండగా ఇందులో 55 ని.లలో వెళ్లిపోవచ్చు’ అని తెలిపారు.
Similar News
News October 10, 2024
సైలెంట్‌గా ఉన్నందుకు క్షమించండి: షకీబ్
బంగ్లా మాజీ PM హసీనాకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు తాను మద్దతుగా నిలవనందుకు క్షమించాలని ఆ దేశ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఫ్యాన్స్‌ను కోరారు. ఈ నెల 21న ఢాకాలో సౌతాఫ్రికాతో జరిగే తన ఆఖరి టెస్టుకు పెద్ద ఎత్తున రావాలని విజ్ఞప్తి చేశారు. ‘నియంతృత్వ వ్యతిరేక నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నా ప్రగాఢ సంతాపం’ అని పేర్కొన్నారు. హసీనా పార్టీ తరఫునే ఆయన ఎంపీ కావడం గమనార్హం.
News October 10, 2024
Q2 ఆదాయంపై ప్రెస్‌మీట్ రద్దు చేసిన TCS
రతన్ టాటా కన్నుమూయడంతో తమ ద్వితీయ త్రైమాసిక ఆదాయాన్ని వివరించేందుకు నిర్వహించాల్సిన ప్రెస్‌మీట్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) రద్దు చేసింది. ఈ రోజు సాయంత్రం ఈ సమావేశం జరగాల్సి ఉండగా, అదే సమయానికి రతన్ అంత్యక్రియలు జరగనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. బోర్డు మీటింగ్ అనంతరం తమ జులై-సెప్టెంబరు పద్దును స్టాక్ ఎక్స్ఛేంజీకి వివరిస్తామని పేర్కొన్నాయి.
News October 10, 2024
కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం దావా
TG: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరఫు లాయర్ ఉమామహేశ్వరరావు దావా దాఖలు చేశారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్, తుల ఉమను సాక్షులుగా పేర్కొన్నారు. పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. కాగా ఇప్పటికే సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.