News November 14, 2024

వర్తు వర్మా.. వర్తు!

image

టీమ్ఇండియా యంగ్ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ సౌతాఫ్రికాతో మూడో టీ20లో అదరగొట్టారు. కేవలం 51 బంతుల్లో సెంచరీ చేసి ఔరా అనిపించారు. దీంతో క్రికెట్ అభిమానులు తిలక్‌ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘వర్తు వర్మా.. వర్తు’ అంటూ ఆయన ప్రదర్శనను కొనియాడుతున్నారు. వర్మ సెంచరీతో టీమ్ఇండియా 219 రన్స్ చేయగలిగింది. ఈ కుర్రాడి బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Similar News

News January 13, 2026

పిల్లలకు ఓదార్పునివ్వండిలా!

image

కొందరు పిల్లలు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉంటారు. పిల్లలు ఇలా ఉంటే వాళ్లను మార్చాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే. ఎందుకంటే పిల్లలు ఇలా చిన్నప్పటి నుంచి ఇలా ఉంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్లతో ఎక్కువ సమయం గడుపుతూ ఓదార్పునివ్వాలి. పిల్లలకి ఎందులో నైపుణ్యం ఉందో గుర్తించి, వాళ్ల అభిరుచులను తెలుసుకుని అందులో ఎదిగేలా సపోర్ట్ చేయండి. అప్పుడే పిల్లలు యాక్టివ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

News January 13, 2026

51పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) కొద్వారా యూనిట్‌లో 51 ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/B.Tech/BSc(Engg.), MBA/MCom ఉత్తీర్ణులై, వయసు 28ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష JAN 25న నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.177. SC, ST, PwBDలకు ఫీజు లేదు. సైట్: bel-india.in

News January 13, 2026

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రివ్యూ&రేటింగ్

image

పెళ్లైన వ్యక్తి ఓ అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని భార్యకు తెలియకుండా ఎలా మేనేజ్ చేశాడనేది స్టోరీ. రవితేజ నటన, సునీల్, వెన్నెల కిశోర్, సత్య కామెడీ, మ్యూజిక్ ప్లస్. హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యం దక్కింది. ఆషికా రంగనాథ్ గ్లామర్ యువతను మెప్పిస్తుంది. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అన్పిస్తాయి. స్క్రీన్ ప్లే, కథను నడిపించడంలో డైరెక్టర్ తడబడ్డారు. మూవీ క్లైమాక్స్ నిరాశకు గురి చేస్తుంది.
రేటింగ్: 2.25/5