News December 1, 2024
యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో వరుణ్ తేజ్?

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణంలో మేర్లపాక గాంధీ డైరెక్షన్లో వరుణ్ ఓ సినిమాను సైన్ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. కాగా.. ఎఫ్3 తర్వాత గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మట్కా సినిమాలతో వరుణ్ వరుస పరాజయాలను చవిచూశారు.
Similar News
News February 7, 2025
ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు పీఎంవో తెలిపింది. ఈ నెల 10, 11 తేదీల్లో ఫ్రాన్స్‌లో ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ఏఐ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. అలాగే అక్కడ ఉన్న థర్మో న్యూక్లియర్ రియాక్టర్‌ను సందర్శించనున్నారు. అనంతరం 12, 13 తేదీల్లో అమెరికాలో ప్రధాని పర్యటించనున్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన US వెళ్లనున్నారు.
News February 7, 2025
ఇకపై ఫోన్‌లోనే అన్ని ధ్రువపత్రాలు: భాస్కర్

AP: రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్‌పై IT శాఖ కార్యదర్శి భాస్కర్ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘ఇకపై అన్ని ధ్రువపత్రాలు ఫోన్‌లోనే జారీ చేస్తాం. ప్రతి పౌరుడికి DG లాకర్ సదుపాయం కల్పిస్తాం. అన్ని పత్రాలూ వాట్సాప్‌లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారానే అర్జీలు, ఫిర్యాదులు చేయొచ్చు. చదువురాని వాళ్లు వాయిస్ ద్వారా సంప్రదించవచ్చు. ప్రతిశాఖలో చీఫ్ డేటా టెక్నికల్ అధికారిని నియమిస్తాం’ అని అన్నారు.
News February 7, 2025
ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్‌కు అలవాటే: కిషన్ రెడ్డి

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘కుల గణనతో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని ఏ చట్టంలో ఉంది. ముస్లింలను కూడా కలిపి బీసీలకు అన్యాయం చేశారు. కుల గణన జరిపిన విధానమే సరిగ్గా లేదు. ఈ సర్వేపై బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కులాలు, మతాల పేరిట ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్‌కు అలవాటే’ అని విమర్శించారు.