News September 2, 2024

పవన్ కళ్యాణ్ కాళ్లు నొక్కుతూ.. ఫొటో షేర్ చేసిన వరుణ్ తేజ్

image

పవర్ స్టార్, AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మెగా హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. చిన్నప్పుడు తన బాబాయ్ కాళ్లు నొక్కుతుండగా తీసిన ఫొటోను వరుణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘మిమ్మల్ని చూస్తూ పెరిగాను. ధర్మం వైపు మీరు అనుసరించిన మార్గం, ఇతరులకు సహాయం చేయాలనే మీ అచంచలమైన సంకల్పం స్ఫూర్తిదాయకం. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ మై పవర్ స్టార్మ్!❤️‍’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 13, 2024

సెబీ చీఫ్‌పై లోక్‌పాల్‌కు మహువా మొయిత్రా ఫిర్యాదు

image

సెబీ చీఫ్ మాధబీ బుచ్‌పై లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేశానని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ముందు ప్రాథమిక, తర్వాత పూర్తిస్థాయి FIR ఎంక్వైరీ జరిగేలా ఈడీ లేదా సీబీఐకి దానిని పంపించాలని అంబుడ్స్‌మన్‌ను కోరినట్టు తెలిపారు. ఆన్‌లైన్ కంప్లైంట్, ఫిజికల్ కాపీ స్క్రీన్‌షాట్లను Xలో పోస్ట్ చేశారు. సెబీ వ్యవహారంలో జోక్యమున్న ప్రతి సంస్థకు సమన్లు ఇవ్వాలని, ప్రతి లింకును ఇన్వెస్టిగేట్ చేయాలని డిమాండ్ చేశారు.

News September 13, 2024

ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం: జగన్

image

AP: విజయవాడలో బుడమేరు మాదిరిగానే ఏలేరు రిజర్వాయర్ వరద ఉద్ధృతి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నా పట్టించుకోలేదని, అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్ వాటర్ మేనేజ్‌మెంట్‌లో నిర్లిప్తత కనిపించిందన్నారు. కనీసం కలెక్టర్లతో రివ్యూ చేయలేదని దుయ్యబట్టారు.

News September 13, 2024

టీడీపీ ఖాతాలోకి జగ్గయ్యపేట మున్సిపాలిటీ

image

AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్ తగిలింది. మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్రతో పాటు పలువురు కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి నారా లోకేశ్ వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలతో జగ్గయ్యపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయింది. వైసీపీ సిద్ధాంతాలు, జగన్ విధ్వంసక విధానాలు నచ్చక వారంతా టీడీపీలో చేరారని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య అన్నారు.