News April 25, 2024

వేమన నీతి పద్యం- భావం

image

కానివానితోడ గలసి మెలగుచున్న
గానివానిగానె కాంతు రవని
దాటి క్రిందబాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తాటి చెట్టు కింద కూర్చొని ఓ వ్యక్తి పాలు తాగుతున్నప్పటికీ అతడు కల్లు సేవిస్తున్నారని అందరూ భావిస్తారు. అలాగే సమాజంలో గౌరవం లేని వ్యక్తులతో కలిసి తిరిగినవారిని కూడా అందరూ అలానే భావిస్తారు.

Similar News

News January 23, 2025

శ్రీలంకపై భారత్ విజయం

image

అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో 60 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. త్రిష(49) రాణించడంతో 118 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 58 పరుగులే చేసింది. భారత బౌలర్లలో షబ్నాం, జోషిత, పరుణిక చెరో రెండు, ఆయూషి, వైష్ణవి తలో వికెట్ తీశారు.

News January 23, 2025

₹2లక్షల కోట్లు.. కేంద్రానికి త్వరలో RBI బొనాంజా!

image

కేంద్ర ప్రభుత్వానికి RBI బంపర్ బొనాంజా ఇవ్వనుంది. అతి త్వరలోనే రూ.1.5-2 లక్షల కోట్ల వరకు బదిలీ చేయనుందని తెలిసింది. డాలర్ల విక్రయం, పెట్టుబడులు, కరెన్సీ ప్రింటింగ్‌ ఫీజు రూపంలో వచ్చిన ఆదాయాన్ని సంస్థ ఏటా కేంద్రానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. క్రితంసారి రూ.2.10లక్షల కోట్లు ఇచ్చింది. ఈసారి అంతకన్నా ఎక్కువే ఇవ్వొచ్చని సమాచారం. డాలర్ల విక్రయంతో RBIకి రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్టు అంచనా.

News January 23, 2025

మహా కుంభమేళా.. 10 కోట్ల మంది పుణ్యస్నానాలు

image

ప్రయాగ్‌రాజ్ (UP) మహా కుంభమేళా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.