News October 1, 2024

వెంకటరెడ్డికి మూడు రోజుల కస్టడీ

image

AP: గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డికి ఏసీబీ కోర్టు కస్టడీ విధించింది. ACB అధికారులు ఏడు రోజుల కస్టడీ కోరగా కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. రేపటి నుంచి ఆయనను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో గనుల శాఖలో టెండర్లు, ఇసుక తవ్వకాలకు అనుమతుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది.

Similar News

News October 6, 2024

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రేపు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరద నష్టం వివరాలను షాకు అందించనున్నట్లు సమాచారం. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే హోంమంత్రుల సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అవుతారు. రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ, తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

News October 6, 2024

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని 8 జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్, వరంగల్, హన్మకొండ, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షం కురవనుందని పేర్కొంది. మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వాన పడింది.

News October 6, 2024

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందన

image

తెలంగాణలో పంట రుణమాఫీ పూర్తిగా కాలేదని ప్రధాని మోదీ నిన్న చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. రూ.2లక్షల లోపు పంట రుణాలన్నీ మాఫీ చేశామన్నారు. 22,22,067 మంది రైతులకు రూ.17,869.22కోట్లు మాఫీ జరిగిందని, అందుకు సంబంధించిన పత్రాలను ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ గ్యారంటీ అంటే గోల్డెన్ గ్యారంటీ’ అని రైతులు విశ్వసించారని రేవంత్ అన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం కేంద్రం నుంచి సహకారం కావాలన్నారు.