News April 25, 2024

వెంకటేశ్, పొంగులేటిల వియ్యంకుడు

image

TG: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి పేరు ఖరారైంది. హీరో వెంకటేశ్, మంత్రి పొంగులేటికి ఈయన వియ్యంకుడు. వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ పెళ్లి చేసుకోగా, పొంగులేటి కూతురు స్వప్నిరెడ్డిని ఆయన చిన్నకుమారుడు అర్జున్ వివాహమాడారు. రఘురాంరెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి పలుమార్లు ఎంపీ, ఎమ్మెల్యేగా సేవలందించారు.

Similar News

News January 10, 2026

షాద్ నగర్-తిరుపతికి బండ్ల గణేశ్ పాదయాత్ర.. ఎందుకంటే?

image

ఏపీ సీఎం చంద్రబాబు పట్ల ప్రత్యేక అభిమానాన్ని చాటేందుకు సినీ నిర్మాత బండ్ల గణేశ్ సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరెస్టైన చంద్రబాబు ఎలాంటి మచ్చ లేకుండా విడుదలైతే శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నారు. కోరిక తీరడంతో HYD షాద్ నగర్ నుంచి తిరుపతికి పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 19న తన నివాసం నుంచి యాత్ర ప్రారంభం కానుండగా తిరుమల శ్రీవారి దర్శనంతో ముగియనుంది.

News January 10, 2026

ఖమేనీ ఫొటోలు కాల్చి.. సిగరెట్లు తాగుతున్న ఇరాన్‌ యువతులు

image

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో యువతులు, మహిళలు ఖమేనీ ఫొటోలకు నిప్పంటించి సిగరెట్లు వెలిగించుకుంటున్నారు. ఇప్పుడు ఇది ట్రెండ్‌గా మారింది. సుప్రీంలీడర్ ఫొటో అంటించడం, మహిళలు సిగరెట్ తాగడం రెండూ నేరమే. మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా, స్వేచ్ఛను కోరుకుంటూ వాళ్లు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో యువతి లాకప్ డెత్ సమయంలోనూ ఇలాంటి నిరసనలే మహిళలు చేపట్టారు.

News January 10, 2026

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

image

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై <<18797338>>దాడులు<<>> కొనసాగుతూనే ఉన్నాయి. 20రోజుల వ్యవధిలో మరో హిందువు హత్యకు గురయ్యాడు. సునంగంజ్ జిల్లా భంగదొహోర్‌లో ఈ దారుణం జరిగింది. తమ కుమారుడిని కొందరు విచక్షణారహితంగా కొట్టారని, ఆ తర్వాత అమిరుల్ ఇస్లామ్ అనే వ్యక్తి విషమిచ్చాడని కుటుంబం ఆరోపిస్తోంది. గురువారం ఈ దాడి జరగ్గా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు చనిపోయాడు. మృతుడు జై మహాపాత్రగా గుర్తించారు.