News March 11, 2025
ప్రణయ్ హత్య కేసులో తీర్పు.. అమృత స్పందన ఇదే..

TG: ప్రణయ్ <<15710208>>హత్య కేసులో<<>> కోర్టు నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రణయ్ భార్య అమృత ఇన్‌స్టాగ్రాంలో ఆసక్తికర పోస్ట్ చేశారు. నిన్నటి తేదీని ఉద్దేశించి ‘రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్’ అని రాసుకొచ్చారు. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత తండ్రి మారుతీరావు 2018లో సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు.
Similar News
News January 24, 2026
క్రెడిట్ చోరీయా… జగన్‌కు ఏం క్రెడిట్ ఉంది: CBN

AP: జగన్ చేసిన పనుల్ని ప్రజలు మరిచిపోతే మళ్లీ వినాశనమే అని CM CBN హెచ్చరించారు. ‘తన మనుషుల్ని పెట్టుకొని ల్యాండ్ టైటిలింగ్‌తో భూమి కాజేసే ప్రయత్నం చేశారు. చివరకు దేవునికిచ్చిన నెయ్యినీ కల్తీ చేశారు. రాక్షసపాలన సాగించారు. తప్పుడు కేసుతో నన్ను జైల్లో పెట్టారు. ఇప్పుడు అమరావతిని అడ్డుకుంటున్నారు. నేను క్రెడిట్ చోరీ చేశానంటున్నారు. ఆయనకేం క్రెడిట్ ఉంది. ఇలాంటి వారిపట్ల జాగ్రత్త’ అని సూచించారు.
News January 24, 2026
బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్: క్రిక్ బజ్

T20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ICC చేర్చినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. గ్రూప్-సిలోని ఇటలీ, నేపాల్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లతోపాటు స్కాట్లాండ్ కూడా ఉంటుందని పేర్కొంది. కాగా ఇరు దేశాల మధ్య కొంత కాలంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా <<18925836>>భారత్‌లో<<>> ఆడేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. BCB నిర్ణయంపై ఆ దేశ ప్లేయర్లూ <<18935631>>ఆందోళన <<>>వ్యక్తం చేశారు.
News January 24, 2026
స్కామ్ లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారు: హరీశ్

TG: భట్టి విక్రమార్క ఎన్ని సాకులు <<18943730>>చెప్పినా<<>> బొగ్గు కుంభకోణం, అందులో రేవంత్ బామ్మర్ది రింగ్‌మెన్ పాత్ర పోషించడం నిజమని హరీశ్ రావు ఆరోపించారు. లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు ‘భట్టి గారూ మీరంటే నాకు చాలా గౌరవం. దీనిపై సిట్టింగ్ జడ్జి, CBI విచారణ కోసమే కిషన్‌రెడ్డికి లేఖ రాశా. రేవంత్, అతని బామ్మర్దిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే మీకూ లేఖ రాస్తా’ అని తెలిపారు.


