News January 3, 2025
నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఘటనకు, అల్లు అర్జున్‌కు సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News January 17, 2025
రేపటి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం
AP: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. టీ-5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో భావర్ కంపెనీ దీన్ని నిర్మించనుంది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణం పూర్తయ్యాక ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుంది. కాగా 2016లోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారు. 2020 తర్వాత వరదలకు కొంత భాగం కొట్టుకుపోయింది.
News January 17, 2025
రూ.3.20 లక్షల ప్రశ్న.. జవాబు తెలుసా?
KBCలో అమితాబ్ బచ్చన్ క్రికెట్‌పై మరో ప్రశ్న అడిగారు. 2024 NOVలో టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మెక్‌కల్లమ్ రికార్డును బద్దలుకొట్టింది ఎవరు అని ప్రశ్నించారు. ఆప్షన్లు A.యశస్వీ జైస్వాల్ B.ఇషాన్ కిషన్ C.సర్ఫరాజ్ ఖాన్ D.శుభ్‌మన్ గిల్. ఈ రూ.3.20 లక్షల ప్రశ్నకు కంటెస్టెంట్ గిల్ అని తప్పుడు జవాబిచ్చారు. దీంతో అతడు రూ.1.60 లక్షలే గెలుచుకోగలిగారు. సరైన జవాబు కామెంట్ చేయండి.
News January 17, 2025
ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్
AP: రాష్ట్రంలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. రేపు కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యాక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 12 నెలలకు 12 థీమ్‌లతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు.