News August 10, 2024

వినేశ్ ఫొగట్ అప్పీల్‌పై ఇవాళ రాత్రికి తీర్పు

image

అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా తనపై వేసిన అనర్హతను భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ సవాల్ చేసిన పిటిషన్‌పై ఇవాళ తీర్పు రానుంది. నిన్న వినేశ్ తరఫు వాదనలు విన్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఇవాళ రాత్రి 9.30 గంటలకు నిర్ణయాన్ని వెల్లడించనుంది. కోర్టు తీర్పు కోసం భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఆమెకు మెడల్ రావాలని అందరూ కోరుకుంటున్నారు.

Similar News

News November 16, 2025

IND vs PAK.. మరోసారి ‘నో హ్యాండ్ షేక్’

image

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో భాగంగా దోహాలో ఇండియా-A, పాకిస్థాన్-A మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ సమయంలో పాక్ కెప్టెన్‌కు భారత కెప్టెన్ జితేశ్ శర్మ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఆసియా కప్ నుంచి ఇది కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుత మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన IND-A 19 ఓవర్లలో 136 రన్స్‌కి ఆలౌటైంది. వైభవ్(45), నమన్(35) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు.

News November 16, 2025

వచ్చే 2 రోజులు అధికంగా చలిగాలుల ప్రభావం

image

TG: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండు రోజులు చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రేపు పశ్చిమ, ఉత్తర తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6-9 డిగ్రీలకు, హైదరాబాద్‌లో 7-11 డిగ్రీలకు పడిపోయే ఛాన్స్ ఉందని తెలిపారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

News November 16, 2025

TELANGANA NEWS

image

✦ టోక్యో డెఫ్లింపిక్స్-2025 షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు రూ.1.20కోటి నజరానా: మంత్రి శ్రీహరి
✦ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో BJP MP ఈటల భేటీ.. కొంపల్లి ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని, బాలానగర్-నరసాపూర్ హైవేలో, నాగార్జునసాగర్ ఎక్స్ రోడ్ వైపు ఫ్లై ఓవర్లు నిర్మించాలని విజ్ఞప్తి
✦ తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. అర్హులందరికీ ఇస్తాం: మంత్రి పొంగులేటి