News August 10, 2024
వినేశ్ ఫొగట్ అప్పీల్‌పై ఇవాళ రాత్రికి తీర్పు
అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా తనపై వేసిన అనర్హతను భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ సవాల్ చేసిన పిటిషన్‌పై ఇవాళ తీర్పు రానుంది. నిన్న వినేశ్ తరఫు వాదనలు విన్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఇవాళ రాత్రి 9.30 గంటలకు నిర్ణయాన్ని వెల్లడించనుంది. కోర్టు తీర్పు కోసం భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఆమెకు మెడల్ రావాలని అందరూ కోరుకుంటున్నారు.
Similar News
News September 15, 2024
కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: సీపీఐ రామకృష్ణ
AP: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని CM చంద్రబాబుని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. విలువైన ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం చూస్తోందని ఆరోపించారు. ఉక్కు ఫ్యాక్టరీలో మూడో ప్లాంట్ కూడా మూసివేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని CBNకు ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు.
News September 15, 2024
BANతో టీ20లకు గిల్, పంత్ దూరం?
అక్టోబర్ 7 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే 3 మ్యాచుల టీ20 సిరీస్‌కు గిల్‌తో పాటు బుమ్రా, సిరాజ్, పంత్‌కు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. వర్క్ లోడ్‌ను మేనేజ్ చేసేందుకు, రాబోయే టెస్ట్ సిరీస్‌ల దృష్ట్యా వీరికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో టీ20 టీమ్‌కు ఎవరెవరు సెలక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చే ఛాన్సుంది.
News September 15, 2024
చేతబడి చేశారనే అనుమానంతో కుటుంబంలో ఐదుగురిని చంపేశారు
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేశారనే అనుమానంతో కుంట పీఎస్ పరిధి ఇట్కల్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేశారు. వారు చేతబడి చేయడంతోనే తమ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడని భావించిన మరో కుటుంబం వీరిని దారుణంగా హతమార్చింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.