News December 22, 2024

ఈ నెల 25న తెలంగాణకు ఉపరాష్ట్రపతి

image

TG: ఈ నెల 25న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాష్ట్రంలో పర్యటిస్తారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఉన్న ఐసీఏఆర్-కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారు. అనంతరం ఆయన సేంద్రీయ రైతులతో సమావేశమవుతారు. ఆ రోజు కన్హా శాంతివనంలో బస చేసి మరుసటిరోజు ఉదయం ఢిల్లీకి వెళ్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News November 21, 2025

రైతుల ఆత్మహత్యాయత్నం.. మీ హామీ ఏమైంది రేవంత్: హరీశ్ రావు

image

TG: భూములు రిజిస్ట్రేషన్ కావడం లేదని MLA క్యాంపు/తహసీల్దార్ ఆఫీసుల వద్ద రైతులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘అధికారంలోకి వస్తే 3 నెలల్లో భూ సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ ఏమైంది రేవంత్? మీ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. భూములపై రైతులకు హక్కు లేకుండా చేస్తోంది. 70వేల పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు.

News November 21, 2025

తీవ్ర కాలుష్యం.. ఢిల్లీలో స్కూల్ గేమ్స్ బ్యాన్!

image

ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో స్కూళ్లలో ఓపెన్ గ్రౌండ్ క్రీడలను నిషేధించే దిశగా అక్కడి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాధారణంగా వింటర్ సీజన్‌లో ఢిల్లీలోని స్కూల్స్ స్పోర్ట్స్ మీట్స్ నిర్వహిస్తుంటాయి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గేమ్స్ రద్దు అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. కాగా ఇండోర్ గేమ్స్ నిర్వహణకూ సౌకర్యాలు కల్పించాలని పేరెంట్స్ కోరుతున్నారు.

News November 21, 2025

ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి అప్డేట్

image

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌పై అప్డేట్ వచ్చింది. ‘రెబల్ సాబ్’ అనే సాంగ్‌ను ఈనెల 23న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా అదిరిపోయే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే.