News June 4, 2024

విజయేంద్ర చెప్పినట్లే విజయం!

image

APలో ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందని పలువురు జ్యోతిష్యం చెప్పగా కొందరు మాత్రమే అంకెలతో సహా కొందరే అంచనా వేయగలిగారు. అందులో మన్యం విజయేంద్ర ఒకరు. TDP+JSP+BJP కూటమికి 140కి పైగా స్థానాలు వస్తాయని ఈయన జ్యోతిష్య ఫలితం వెల్లడించారు. విజయేంద్ర అంచనాలను Way2News కూడా పబ్లిష్ చేసింది. ఇప్పుడు ఎన్నికల్లో ఇదే రిజల్ట్ రావడం మనం చూస్తున్నాం.

Similar News

News November 14, 2024

అక్షర్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న 3వ టీ20లో భారత క్రికెటర్ అక్షర్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నారు. సిక్సు కొట్టి ఊపుమీదున్నట్లు కనిపించిన సఫారీ హిట్టర్ డేవిడ్ మిల్లర్ ఆ తర్వాత బంతిని భారీ షాట్ కొట్టారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్ అందుకున్నారు. దీంతో మిల్లర్(18) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోర్ 15.5 ఓవర్లలో 142/5. భారత్ గెలుస్తుందా?

News November 14, 2024

BGTలో మా బౌలర్లదే పైచేయి: హాడిన్

image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ముందు భారత బ్యాటర్లు నిలవలేరని ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ అన్నారు. తొలి టెస్ట్ జరిగే పెర్త్‌లో ఓపెనింగ్ బ్యాటర్లకు చాలా కష్టంగా ఉంటుందని తెలిపారు. IND ఓపెనర్ జైస్వాల్ చాలా మంచి బ్యాటర్ అని, కానీ AUSలో ఆడిన అనుభవం లేదని పేర్కొన్నారు. బౌన్స్‌ను అతను ఎలా హ్యాండిల్ చేస్తారో ఇప్పుడే చెప్పలేమని ఓ పాడ్‌కాస్ట్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

News November 14, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: నవంబర్ 14, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:06
✒ సూర్యోదయం: ఉదయం 6:21
✒ దుహర్: మధ్యాహ్నం 12:01
✒ అసర్: సాయంత్రం 4:05
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:40
✒ ఇష: రాత్రి 6.55
>> నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.